‘శ్రీరెడ్డి దొరికిపోయింది’... వైరల్ అవుతోన్న ఫోటో..

Twitter

శ్రీరెడ్డి... క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది.

  • Share this:
    శ్రీరెడ్డి... క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలేపింది శ్రీరెడ్డి. అంతేకాకుండా వీలున్నప్పుడల్లా రాజకీయ, సినీ అంశాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ.. సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అది అలా ఉంటే ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ట్యాగ్ లైన్. కొత్త సంవత్సరం సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా టైటిల్‌ వెరైటీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది ఈ సినిమా పోస్టర్. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నాడు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధలేకపోయినప్పటికీ.. శ్రీరెడ్డి అనే టైటిల్‌పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందంటున్నారు సినీ పండితులు.

    Published by:Suresh Rachamalla
    First published: