SRI REDDY CONTROVERSIAL POST ON CHIRANJEEVI NAGARJUNA FAMILIES PK
చిరంజీవి, నాగార్జునపై శ్రీ రెడ్డి వివాదాస్పదమైన పోస్ట్..
శ్రీ రెడ్డి నాగార్జున చిరంజీవి (sri reddy chiranjeevi nagarjuna)
Sri Reddy: ఒక్కరి మరణం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను కూడా కుదిపేస్తుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారింది.
ఒక్కరి మరణం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను కూడా కుదిపేస్తుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారింది. అన్నింటికి మించి స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే ఆయన్ని కొందరు కావాలనే మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారంటూ ఆయన అభిమానులు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ సంతాపం తెలపడంతో పాటు కొందరు మాత్రం విమర్శలు కూడా చేస్తున్నారు.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy hot)
ఈయన మరణం పక్కా ప్లానింగ్‌తో చేసిన మర్డర్ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పాటు ఇండస్ట్రీలో 'నెపోటిజం'పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్‌తో పాటు వివేక్ ఒబేరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై స్పందించారు. ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా చాలా రోజుల తర్వాత తన చేతికి పని చెప్పింది.
చిరంజీవి నాగార్జునపై శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy post)
గట్స్ లేని మూవీ లెజండ్స్ మాత్రమే న్యూ టాలెంట్‌ని చంపేస్తున్నారు.. సిగ్గు పడండి.. వాళ్లే చిరంజీవి, నాగార్జున, బాలీవుడ్ ఖాన్స్ అండ్ కపూర్ ఫ్యామిలీస్ అంటూ కమెంట్ పెట్టింది. దాంతో పాటు తన మార్క్ బూతులు కూడా వాడేసింది శ్రీ రెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజంపై కామెంట్ చేయడమే కాకుండా చిరంజీవి, నాగార్జున కుటుంబాలపై కూడా విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ఇక్కడ కూడా బంధుప్రీతి ఎక్కువైపోతుందని.. వారసులు తప్ప బయటి వాళ్లు రావట్లేదని.. రానివ్వట్లేదని చెప్పింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.