SRI REDDY CONTROVERSIAL COMMENTS ON TOLLYWOOD HERO RANA DAGGUBATI MARRIAGE PK
రానా దగ్గుబాటి పెళ్లిపై శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)
Sri Reddy Rana Daggubati: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలోనే బ్రహ్మచర్యానికి స్వస్తి పలకబోతున్నాడు. దాంతో అంతా ఈయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలోనే బ్రహ్మచర్యానికి స్వస్తి పలకబోతున్నాడు. దాంతో అంతా ఈయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో రానా పెళ్లి టాపిక్ హల్ చల్ చేస్తుంది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ మిత్రులు కూడా ఈయనకు కంగ్రాట్స్ చెప్పారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ను పరిచయం చేసిన తర్వాత క్షణం నుంచి కూడా రానా పెళ్లి టాపిక్ హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అంతా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.
రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)
అయితే ఎంతమంది చెప్పినా కూడా ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించింది. రానా పెళ్లి గురించి ఈమె కూడా పోస్ట్ చేసింది. నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు.. ఈ అమ్మాయితో అయినా మీరు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేసింది ఈమె. దాంతో లేనిపోని న్యూస్‌కు మళ్లీ తావిచ్చింది శ్రీ రెడ్డి. అసలు రానా జీవితంలో ఏం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు అందర్లోనూ మొదలయ్యాయి.
అభిరామ్ దగ్గుబాటితో శ్రీ రెడ్డి (abhiram sri reddy)
గతంలో రానా తమ్ముడు అభిరామ్ విషయంలో శ్రీ రెడ్డి చేసిన రచ్చ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలోనే తమ ఫస్ట్ నైట్ జరిగిందంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఆ తర్వాత కూడా సురేష్ బాబును మామ అని పిలుస్తూ టీజ్ చేస్తుంది శ్రీ రెడ్డి. ఈ క్రమంలో రానా పెళ్లిపై ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.