Home /News /movies /

SRI REDDY CONTROVERSIAL COMMENTS ON BIGG BOSS 4 TELUGU AND SAYS SHOW IS WORST PK

Sri Reddy: బిగ్ బాస్‌లో అన్నీ దొంగ ఏడుపులు.. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (sri reddy/Facebook)

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (sri reddy/Facebook)

Sri Reddy on Bigg Boss 4: శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పరిచయాలు లేని వాళ్లకు కూడా తనదైన శైలిలో ఇంట్రడ్యూస్ అవుతుంది శ్రీ రెడ్డి. ఒక్కసారి ఈమెతో పెట్టుకుంటే..

శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పరిచయాలు లేని వాళ్లకు కూడా తనదైన శైలిలో ఇంట్రడ్యూస్ అవుతుంది శ్రీ రెడ్డి. ఒక్కసారి ఈమెతో పెట్టుకుంటే అంతే సంగతులు ఇంక. బతుకు తీసి బజారులో పెట్టే వరకు నిద్ర కూడా పోదు. అందుకే శ్రీ రెడ్డి ఏం మాట్లాడినా కూడా ఎందుకురా నాయనా లేనిపోని తలనొప్పులు అంటూ ఎవరూ ఆమె వైపు కూడా చూడరు. స్టార్ హీరోలను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటుంది శ్రీ రెడ్డి.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)

ఒకప్పుడు తెలుగులో చాలా కాంట్రవర్సీలు సృష్టించిన శ్రీ రెడ్డి.. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది. అయితే ఇదంతా తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె చూపులు బిగ్ బాస్‌పై పడినయ్. సీజన్ 4పై నోరు పారేసుకుంది శ్రీ రెడ్డి. తనను కానీ పిలుచుంటే బిగ్ బాస్ బట్టలిప్పేదాన్ని అంటూ రెచ్చిపోయి కామెంట్ చేసింది. తనకు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదని.. ఆ ఇంట్లో అంతా దొంగ ఏడుపులు ఉంటాయంటుంది.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)

ఎవరైనా ఏడ్చినా కూడా అన్నీ దొంగ ఏడుపులే కానీ నిజం మాత్రం కాదని చెప్పింది శ్రీ రెడ్డి. అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందంటూ కామెంట్ చేసింది. తనకు అవకాశం వచ్చుంటే అసలు రియాలిటీ చూపించేదాన్ని అంటుంది శ్రీ రెడ్డి. కానీ ఏం చేస్తాం ఈమెను పిలవలేదు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 2 సమయంలోనే శ్రీ రెడ్డి హౌజ్‌లోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు నాని హోస్ట్ కావడంతో అది జరగలేదని వార్తలున్నాయి.
శ్రీ రెడ్డి నాని ఫైల్ ఫోటోస్ (nani sri reddy)
శ్రీ రెడ్డి నాని ఫైల్ ఫోటోస్ (nani sri reddy)

నాని, శ్రీ రెడ్డి మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎప్పుడూ శ్రీ రెడ్డి పేరు వినిపించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ గురించి నోరు పారేసుకుంది శ్రీ రెడ్డి. దొంగలు, దొంగ ఏడుపులు అంటూ రెచ్చిపోయింది ఈ కాంట్రవర్సీ క్వీన్. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా కూడా తన తీరు నోరు మార్చుకోనంటుంది శ్రీ రెడ్డి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు