శ్రీరెడ్డి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీ పెద్దల్లో రైల్లు పరిగెత్తించింది. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. ముఖ్యంగా రామానాయుడుకు చెందిన దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని తనను వాడుకోని ఒదిలేసాడంటూ చెప్పుకొచ్చింది. ఆ మధ్య ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేసి ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను మీడియా ముఖంగా నానా మాటలు అన్నది. ప్రస్తుతం శ్రీ రెడ్డి.. చెన్నైలో ఉంటుంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో తాను చేస్తోన్న వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు అపుడపుడు ఘాటైన పోస్టులు పెడుతూనే ఉంది.అంతేకాదు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకుండా పోయిన వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది.
ఆ మధ్య ఈమె శివుడు, అఘోరగా మేకప్ వేసుకొని పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. తాజాగా ఈమె హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హైపర్ ఆది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా.తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి మాట్లాడుతూ... హైపర్ ఆది గాని పెళ్లి చేసుకుంటే కరోనా చస్తుందా ? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల. 42 ఏళ్ల వయసులో ఇపుడు హైపర్ ఆది పెల్లి చేసుకోకపోతే ఏంది అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Aadi, Jabardasth comedy show, Sri Reddy, Telugu Cinema, Tollywood