Home /News /movies /

SRI REDDY COMMENTS ON CHIRANJEEVI NAGA BABU AND PAVAN KALYAN OVER MAA ELECTIONS VB

Sri Reddy: చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న మెగా అభిమానులు..

శ్రీరెడ్డి (ఫైల్)

శ్రీరెడ్డి (ఫైల్)

Sri Reddy: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తర్వాత ప్రకాశ్ ప్యానల్ నుంచి గెలిచిన దాదాపు 11 మంది రాజీనామాలు కూడా సమర్పించారు. విష్ణుతో కలిసి పనిచేయడం తమకు ఇష్టం లేదని వాళ్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తర్వాత ప్రకాశ్ ప్యానల్ నుంచి గెలిచిన దాదాపు 11 మంది రాజీనామాలు(Resign) కూడా సమర్పించారు. విష్ణు(Vishnu)తో కలిసి పనిచేయడం తమకు ఇష్టం లేదని వాళ్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇంత జరిగినా.. ‘మా’ లో మాత్రం వేడి చల్లారలేదు. ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఎలాంటి సమాచారం లేకుండా.. ఎంతో సాదాసీదాగా మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు.

  Anushka Marriage: అనుష్కకు అప్పుడే పెళ్లి జరుగుతుందట..! ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా..


  అంతేకాదు సీనియర్ నటులకు ఇచ్చే పెన్షన్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మీ మద్దతు నాకు కావాలి. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానంటూ చెప్పుకొచ్చారు.
  మంచు విష్ణు అక్టోబర్(October) 16న త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు చేసుకుంటూ.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను క‌లుస్తుండ‌గా.. మ‌రోవైపు ప్రకాష్ రాజ్(Prakash Raj) మాత్రం ఎన్నిక‌ల రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. మా ఎన్నికల తీరుపై ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరూ మాట్లాడారు. 

  Manchu Vishnu as MAA President : ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలు పై తొలి సంతకం..

  ‘మా’కు జరిగిన ఎన్నికల తీరును వారు తప్పుపడతున్నారు. ఆ ఎన్నికల రోజును మోహన్ బాబు ప్రతీ ఒక్కరినీ ఇష్టం వచ్చినట్లు తిట్టారని.. బూతులు కూడా మాట్లాడారని బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బెనర్జీ కన్నీళ్లు పెట్టుకోగా తనకు రక్తం మరిగినట్లు అయిందని బుల్లితెర నటుడు, నిర్మాత ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఇలా ఉండగా..  మా ఎన్నిక‌ల వివాదంపై న‌టి శ్రీ‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

  తాను మా కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న చేసిన‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని.. త‌న‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేద‌ని వాపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అంద‌రూ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్డు పైకి వ‌చ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నార‌ని విమ‌ర్శించింది.

  Samantha: సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! ఏంటంటే..


  అందరితో రాజీనామాలు సమర్పించడానికి మూల సూత్రం అయిన ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ కు సేవ చేస్తానని అంటున్నారు.. ఎవరు సేవ చేస్తే ఏమిటి..?మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ కు ఏడుపు ఎందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఎలాగైనా ప్రకాష్ రాజ్ ను గెలిపించాలని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నగాబాబు వేసిన ఎత్తులు పారలేదని.. వారు ఎప్పటి నుంచో ఏలుతున్న ఈ రాజ్యం పోయిందని.. ఆ ఆధిపత్యం తమకు దగ్గకుండా పోయినందుకే ఇలాంటి రాద్దాంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

  తనను గతంలో మా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప‌రువు తీశాన‌ని  నాగబాబు, జీవిత, హేమ తో సహా కొందరు వ్యక్తులు తనను ఏడిపించారని.. కానీ ఇప్పుడు వారే అసోసియేషన్ పరువు తీస్తున్నారని.. ఆమె విమర్శించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమ్మ, కాపు ఫీలింగ్ వచ్చిందని.. దాసరి తర్వాత ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త కేవ‌లం మోహ‌న్ బాబుకే ఉంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.
  Published by:Veera Babu
  First published:

  Tags: MAA Elections, Sri Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు