SRI REDDY CHIRANJEEVI ACTRESS SRI REDDY AGAIN TARGET MEGASTAR CHIRANJEEVI CAST HERE ARE THE DETAILS TA
Sri Reddy - Chiranjeevi: మరోసారి చిరంజీవిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. నాగబాబు జోక్ గుర్తు చేస్తూ..
చిరంజీవి పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)
Sri Reddy - Chiranjeevi | శ్రీరెడ్డి .. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినీ ప్రముఖులను తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది.
Sri Reddy - Chiranjeevi | శ్రీరెడ్డి (Sri Reddy)... గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినీ ప్రముఖులను తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) టార్గెట్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి చిరంజీవి కులం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి (YS Jagan).. చిరంజీవికి ఏపీ తరుపున రాజ్యసభకు నామినేట్ చేస్తారనే వార్త హల్చల్ చేస్తోంది. గత కొన్నిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలే కలిగివున్నారు. అంతేకాదు ఏపీలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాల్లో ఏపీ సీఎం జగన్‌కు పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించిన సందర్భాలున్నాయి. మరోవైపు చిరంజీవి తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ పలు అంశాల్లో ఏపీ సీఎంను ఎండగడుతున్న చిరంజీవి మాత్రం జగన్‌కు మాత్రం అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా చిరుకు రాజ్యసభ సీటు ఇచ్చి పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై శ్రీ రెడ్డి (Sri Reddy) స్పందిస్తూ.. రాజ్యసభ సీటుకు చిరంజీవి సరైన వ్యక్తి కాదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పార్టీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. మరోవైపు ఆయనకు దక్కిన కేంద్ర మంత్రి పదవి కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. రాజకీయాల్లో చిరంజీవి అన్ని విధాల అసమర్ధుడిగా నిలిచారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
చిరంజీవి శ్రీ రెడ్డి
మరోవైపు చిరంజీవి (Chiranjeevi) కళాకారుల ఫ్యామిలీకి చెందిన వారు మాత్రమే అని పేర్కొంటూ.. ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కాదన్నారు. చిరంజీవి నిజమైన కాపు కాదన్నారు. మరోవైపు వైసీపీని నమ్ముకున్న నిజమైన కాపు నేతకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని ఏపీ సీఎం జగన్‌కు శ్రీ రెడ్డి సూచించారు. మరో పోస్ట్‌లో పల్లకి మోసేవాడి కష్టాన్ని ఒదిలేసి దారిపోయే దానయ్యకు శిఖరం మీద కూర్చోబెట్టడం అంటే కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చుండబెట్టినట్టు అనే జోక్ అప్పట్లో జగన్ మీద నాగబాబు (Nagababu) వేయించాడని శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఆ అవమానాన్ని మరిచిపోయి జగనన్న తప్పు చేస్తున్నారా ? అని శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
సీఎం జగన్, చిరంజీవిని
మరోవైపు శ్రీరెడ్డి (Sri Reddy) పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు శ్రీ రెడ్డి చెప్పింది అక్షరాల నిజం అంటూ చెబుతుంటూ.. మరికొందరు మాత్రం చిరంజీవికి రాజకీయాలు ఒద్దనుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి అందరివాడు కాబట్టి ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. అలా అని ఆయనతో ఏకీ భవించనట్టు కాదని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తంగా చిరంజీవి పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.