హోమ్ /వార్తలు /సినిమా /

Bigg boss 3 | బిగ్‌బాస్‌ హౌస్‌లోకి శ్రీరెడ్డి, జబర్దస్త్ నాగబాబు...? సంచలనం రేపుతున్న ట్వీట్....

Bigg boss 3 | బిగ్‌బాస్‌ హౌస్‌లోకి శ్రీరెడ్డి, జబర్దస్త్ నాగబాబు...? సంచలనం రేపుతున్న ట్వీట్....

శ్రీరెడ్డి,నాగబాబు

శ్రీరెడ్డి,నాగబాబు

Bigg boss 3 | బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ కాకముందే వివాదాలు రేపుతుంటే, తాజాగా శ్రీరెడ్డి సైతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా చెప్పేయడంతో షోపై మరింత అంచనాలు పెంచేసింది.

Bigg boss 3 | బిగ్ బాస్ 3 రియాలిటీ షోలోకి శ్రీ రెడ్డి ఎంట్రీ ఖరారు అయ్యందనే వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ కాకముందే వివాదాలు రేపుతుంటే, తాజాగా శ్రీరెడ్డి సైతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా చెప్పేయడంతో షోపై మరింత అంచనాలు పెంచేసింది. అయితే బిగ్ బాస్ షోలో తనకు అవకాశం వచ్చింది అంటూ శ్రీరెడ్డి ట్విట్టర్ వేదికగా పెడుతున్న పోస్టులు ప్రస్తుతం చర్చకు దారిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి తనను, బిగ్ బాస్ లో చూడాలని చాలామంది కోరుకుంటున్నారని, అయితే బిగ్ బాస్‌ షోలో నటుడు నాగబాబు సైతం వచ్చే అవకాశం ఉందని, ఒక వేళ ఆయన బిగ్ బాస్ షోలో పాల్గొంటే, దబిడి దిబిడే.. అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు బిగ్ బాస్ లోగోపై తన ఫోటోను జతచేస్తూ శ్రీరెడ్డి ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.

ఇదిలా ఉంటే తెలుగు నాట సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం మూడో సీజన్ కు సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకూ షో కంటెస్టెంట్స్ ఎవరూ అనే విషయం మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఈ షోకు ఇప్పటికే నాగర్జున వ్యాఖ్యత అని స్టార్ మా ప్రోమోలు విడుదల చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాక ముందే సంచలనం రేపుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులఫై న్యూస్ ప్రెజెంటర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి షోపై పడింది. మరి శ్రీరెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చేస్తే బిగ్ బాస్ ఇంకెన్ని సంచలనాలకు వేదిక కానుందో ఎదురుచూడాల్సిందే.

First published:

Tags: Bigg Boss, Bigg Boss 3, Jabardasth comedy show, Jabards, Nagababu, Sri Reddy

ఉత్తమ కథలు