కేసీఆర్‌ ఒక ఫైర్ బ్రాండ్.. మంచు విష్ణు, ఆయన్ని ఎవరైనా తిడితే.. శ్రీరెడ్డి వార్నింగ్..

కేసీఆర్,శ్రీరెడ్డి,మంచు విష్ణు,

ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా జరిగిన అనర్థానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అవకతవకల కారణంగా 25 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి,మంచు విష్ణులు తెలంగాణ సీఎంను వెనకేసుకొచ్చారు.

  • Share this:
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా జరిగిన అనర్థానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అవకతవకల కారణంగా 25 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. మొత్తానికి సీఎం కేసీఆర్ ఈ ఘటన పై స్పందించి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్  సదుపాయాన్ని కల్పించారు. ఐనప్పటికీ విద్యార్థులు చనిపోతేగానీ మీరు స్పందించరా అంటూ పలు విద్యార్థి, రాజకీయ వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నాయి. ఈ తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు మరి కొందరు హీరోలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సోషల్ మీడియా ద్వారా సందేశాలిచ్చారు కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో కనీసం విమర్శించలేదు. దీంతో సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడుతున్నారని విమర్శలు బయలుదేరాయి వీటికి సమాధానంగా మంచు విష్ణు తన ట్విటర్‌లో సమాధానం ఇచ్చారు"ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా 20 మంది తమ్ముళ్లు, చెల్లెళ్లను మనం కోల్పోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. కేటీఆర్  విద్యార్థుల కోసం పనిచేసే రాజకీయ నాయకుడని నాకు చాలా కాలంగా తెలుసు. కేసీఆర్ గారు ఫైర్‌బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన డిక్టేటర్ ఎంత మాత్రం కాదు.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నింధించడం మాని అసలు ఈ తప్పిదాలు జరగడానికి గల కారణాలు గుర్తించాలన్నారు. మంచు విష్ణు కేసీఆర్‌కు అనుకూలంగా ట్వీట్ చేయడంతో పలువురు మంచు విష్ణు తీరును దుయ్యబడుతున్నారు.

ఇదే విషయమై నటి శ్రీరెడ్డి ఒక అడుగు ముందుకేసింది. ఇంటర్ బోర్డు వ్యవహారం తాజాగా స్పందించిన శ్రీరెడ్డి మాత్రం విద్యార్థులకు కాకుండా, కేసీఆర్‌కి మద్ధతుగా మాట్లాడడం కొందరికి ఆగ్రహం కలుగచేసే విధంగా వుంది. ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పులకు అందరూ కేసీఆర్‌ను, అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీస్తుంటే దానికి శ్రీరెడ్డి స్పందించి కేసీఆర్‌ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నారు. ఎవరైనా ఏమైనా అంటే  ఒక్కొక్కరికి పగిలిపోతుంది అంటూ ఘాటుగా స్పందించింది. గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కౌస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  దానికి కృతజ్ఞతగా శ్రీరెడ్డి..కేసీఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని పలువురు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విద్యార్థుల తరుపున మాట్లాడాల్సిన వీళ్లు ... తెలంగాణ ప్రభుత్వానికి భజన చేయడం పై ప్రజా, విద్యార్థి సంఘాల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
First published: