మరోసారి నాగబాబును టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. అంబటి రాంబాబు సాక్షిగా..

నాగబాబు పై శ్రీరెడ్డి కామెంట్స్ (Twitter/Photos)

ఎపుడు సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ టైమ్ పాస్ చేసే శ్రీరెడ్డి తాజాగా మరోసారి మెగా బ్రదర్ నాగబాబును లక్ష్యంగా చేసుకొని ట్వీట్ చేసింది.

 • Share this:
  ఎపుడు సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ టైమ్ పాస్ చేసే శ్రీరెడ్డి తాజాగా మరోసారి మెగా బ్రదర్ నాగబాబును లక్ష్యంగా చేసుకొని ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా మన దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని బారిన పడి ఎంతో మంది కన్నుమూసారు. ఈ వైరస్ కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో చాలా మంది పేదవాళ్లకు పనిలేకుండా పోయింది. దీంతో వాళ్లు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రూ. 1000 వంతున ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ డబ్బులను కేంద్రం ఇచ్చినా.. వైసీపీ నాయకులు తామే ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారంటూ నాగబాబు తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసాడు. మరోవైపు నిన్న ప్రధాన మంత్రి పిలుపు మేరకు అందరు దీపాలు వెలిగించిన సంగతి తెలిసిందే కదా. కానీ నాగబాబు మాత్రం వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆరోగ్యం బాగుండాలని దీపం పెడతానని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఆయన ఆరోగ్యం బాగుపడితే..(అంబటి రాంబాబు) తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడు.


  దానిపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. కేంద్రం ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ల అకౌంట్లో పడుతున్నాయి. అంటూ ఇపుడే బీజేపీలో చేరిన కొత్త నీరు ఒకటే అరవడం మొదలుపెట్టింది అంటూ నాగబాబుకు కౌంటర్ వేసాడు.  నాగబాబు ట్వీట్ పై అంబటి రాంబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. అంబటి రాంబాబుతో పంచ్‌లా, నాగబాబుకు గొంతు సెట్ అయింది కానీ.. బుద్ధీ సెట్ అవ్వలే అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

  నాగబాబు పై శ్రీరెడ్డి కామెంట్స్ (Facebook/Photo)


  మొత్తానికి నాగబాబు, అంబటి రాంబాబు మధ్య నడిచిన పొలిటికల్ వార్‌కు శ్రీ రెడ్డి తనదైన శైలిలో మెగా బ్రదర్ పై పోస్ట్ పెట్టడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: