వివాదాస్పద నటి శ్రీరెడ్డి ట్విట్టర్లో మరో బాంబ్ పేల్చింది. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో తెలుగు పరిశ్రమలో ఉన్న రసికరాజులకు నిద్రలు లేకుండా చేసిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. తాాజాగా ఈ భామ దగ్గుబాటి ఫ్యామిలీపై తనదైన శైలిలో మరోసారి స్పందించింది.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ట్విట్టర్లో మరో బాంబ్ పేల్చింది. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో తెలుగు పరిశ్రమలో ఉన్న రసికరాజులకు నిద్రలు లేకుండా చేసిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. తెలుగు మీడియాలోనే కాకుండా నేషనల్ మీడియాలో సైతం ఆమె పేరు మారు మోగింది.తనకు సినిమాల్లో అవకాశాలను ఎరచూపి శారీరకంగా మానసికంగా హింసించిన టాలీవుడ్ బడా బాబుల గుట్టు ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఆమె ఎప్పుడు ఎవరి పేరును బయటపెడుతుందోనని టాలీవుడ్ రసికరాజుల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు అప్పట్లో రామానాయుడు మనవడు..సురేష్ బాబు చిన్నకొడుకు..రానా తమ్ముడు అభిరామ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అమ్మాయిలను వాడుకుని వదిలేసే అభిరామ్ లాంటి వాళ్ళని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలి అంటూ కోరింది. అంతేకాదు ఇక ముందు అభిరామ్ లాంటి వాళ్లు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలన్నారు. నా ఉద్యమానికి మరకలు అంటించే వాళ్ళకి ఇదే నా సవాల్’ అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా బహిరంగ సవాల్ విసిరిన శ్రీరెడ్డి. తాజాగా దగ్గుబాటు అభిరాంను భర్తతో పోల్చుకొని వార్తల్లో నిలిచింది.
దగ్గుబాటి అభిరామ్‌తో శ్రీరెడ్డి (ఫైల్ ఫోటో)
అప్పట్లో దగ్గుబాటి అభిరామ్ తనకు ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి తనను వాడేసుకున్నాడంటూ ఫోటోలతో సహా విడుదల చేసిన శ్రీరెడ్డి. మరికొందరు కోలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా అలాంటివారేనంటూ వాళ్ల పేర్లు చెప్పి షాకిచ్చింది. ఇదిలావుంటే... సమంత నటించిన తాజా చిత్రం ఓ బేబీ సక్సెస్ కావడంతో సమంత, రానా తమ్ముడు అభిరామ్‌కి కేక్ తినిపించింది. దీనిపై శ్రీరెడ్డి ఘాటు కామెంట్లు చేసింది. ఈ వేడుకకి సమంత నా భర్త అభిరామ్‌ను మాత్రమే పిలిచింది. నన్ను పిలువలేదు. అందుకే నేను హర్ట్ అవుతున్నానంటూ సెటైరికల్ కామెంట్ చేసింది. ఇదిగో ఆ పోస్టును మీరూ చూడొచ్చు. నేను హర్ట్ అయ్యాను అంటూ . మా ఆయన కోతి వేషాలు చూడండహో అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.