మరోసారి రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిపై శ్రీ రెడ్డి ఫైర్.. అదీ సంగతి..

శ్రీరెడ్డి, అభిరామ్ (File/Photo)

దగ్గుబాటి అభిరామ్.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇతను మాత్రం శ్రీ రెడ్డి ఇష్యూలో బాగానే పాపులర్ అయ్యాడు. తాజాగా శ్రీరెడ్డి మరోసారి అభిరామ్ పై రెచ్చిపోయింది.

 • Share this:
  దగ్గుబాటి అభిరామ్.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇతను మాత్రం శ్రీ రెడ్డి ఇష్యూలో బాగానే పాపులర్ అయ్యాడు. అభిరామ్ తనకు హీరోయిన్‌గా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని ఒదిలేసాడని చెప్పడంతో పాటు అతనితో చనువుగా ఉన్న ఫోటోలను బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. తనను వాడుకున్న తనకు ఛాన్సులు ఎందుకు ఇవ్వలేదన్న ఆక్రోషం వెళ్లగక్కింది.  ‘సినీ ఇండస్ట్రీలో పడుకోకుండా ఏ పనీ కాదు... ’ అంటూ పచ్చిగా మాట్లాడుతూ ఆమె అప్పట్లో  పలు ఇంటర్వ్యూల్లో చెప్పి న సంగతి తెలిసిందే కదా. ఐతే.. నిన్నటి నిన్న దగ్గుబాటి అభిరామ్‌కు చెందిన కారు యాక్సిడెంట్‌కు గురైనట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమైన అభిరామ్ తండ్రి సురేష్ బాబు అలాంటిదేమి లేదు అసలు ఈ ప్రమాదానికి మా ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు  అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐనా ఈ యాక్సిడెంట్ విషయాన్ని పట్టుకొని శ్రీ రెడ్డి మరోసారి దగ్గుబాటి అభిరామ్‌ను టార్గెట్ చేసింది.

  శ్రీ రెడ్డి (Image: Srireddy/ Facebook)


  అంతకు ముందు శ్రీ రెడ్డి.. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు, రానా, వెంకటేష్, నానికి సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగితే.. చేసిన పాపం ఊరకనే పోదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇపుడు అభిరామ్ దగ్గుబాటి కారు ప్రమాదంపై మాట్లాడుతూ.. అభి నీకు గుర్తుందా ? నీ కారు ఎంత ? నీ స్టేటస్ ఎంత ? నేను రామానాయుడు మనవడిని ? సురేష్ బాబు కొడుకును ? వెంకటేష్ పుత్ర రత్నాన్ని ? రానా తమ్ముడిని అన్నావే గుర్తు చేస్తూ.. నువ్వో అప్పట్లో నన్న ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ నటిని అన్నావే. నన్ను నా కారును అవమానించావే ? ఈ రోజు నీ కారుకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది  అంటూ దేవుడు ఉన్నాడ్రా ? అంటూ చెప్పుకొచ్చింది. డబ్బు ఉంది కదా అని మిడిసిపడకు. ఈ పేరు, డబ్బు ఏది శాశ్వతం కాదు. మంచితనం, మంచి పేరు, ఎదుటి వారిని అర్ధం చేసుకోవడం. అవసరమైతే ఎవరికీ అపకారం చేయకుండా మంచిగా ఉండటం నేర్చకోవాలన్నారు. అలా అని నేనిమి ఉత్తమమురాలిని అని చెప్పడం లేదు. కానీ మటుకు నాకు కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని తన అభిరామ్ పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: