• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SREEMUKHI SHARES RAM GOPAL VARMA NAGNAM PHOTO WITH NETIZEN THIS PIC GOES VIRAL ON SOCIAL MEDIA SR

Sreemukhi : నగ్న ఫోటోను అడిగిన నెటిజన్.. ఫోటో షేర్ చేసి కోరిక తీర్చిన శ్రీముఖి..

Sreemukhi Instagram

Sreemukhi: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఓ ఛానెల్‌లో కనిపిస్తూనే ఉంటూ చలాకైనా మాటలతో అలరిస్తూనే ఉంటుంది. అది అలా ఉంటే శ్రీముఖి ఓ నెటిజన్ కోరిక మేరకు నగ్న ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Share this:
    Sreemukhi: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఓ ఛానెల్‌లో కనిపిస్తూనే ఉంటూ చలాకైనా మాటలతో అలరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పటాష్ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. పోయిన సంవత్సరం కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడవ సీజన్‌లో శ్రీముఖి పాల్గోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. ఇక ఇటీవల టీవీ షోలకు కొంత విరామం ఇచ్చి గోవా వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్ హంగామా హంగామా చేసిన శ్రీముఖి తాజాగా తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. అందులో భాగంగా నెటిజన్స్ ఆమెను అనేకరకాల ప్రశ్నలు అడిగారు. కొందరు చిన్ననాటి ఫోటో పెట్టమంటే వెంటనే తన సోదరుడి సుశ్రుత్‌తో చిన్నతనంలో దిగిన ఓ ఫోటోను పంచుకుంది. మరో నెటిజన్ మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా చిరంజీవి అని బదులిచ్చింది. ఇక మరో కొంటె నెటిజన్ మాత్రం ఏకంగా తన న్యూడ్ పిక్‌ను అడిగాడు. దానికి శ్రీముఖి ఏమాత్రం నొచ్చుకోకుండా.. నేక్డ్ ఫోటోను అతనితో పంచుకుంది. దీంతో షాక్ తినడం ఆ ప్రశ్న అడిగిన నెటిజన్ వంతు అయ్యింది.

    నేక్‌డ్ పిక్ అడగ్గా.. శ్రీముఖి రామ్ గోపాల్ వర్మ నేక్‌డ్ సినిమా పిక్‌ను పంచుకుంది. దీంతో కొందరు నెటిజన్స్ శ్రీముఖి సమయస్పూర్తిని మెచ్చుకుంటుంటే.. మరికొందరు భలేగా ఇచ్చావు బదులు అంటూ ఆమెను పొగుడుతూ కామెంట్స్ రూపంలో తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పంచుకున్న ఆ నగ్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Sreemukhi news, Sreemukhi film its time to party, Anchor Sreemukhi crazy uncles, Sreemukhi news, Sreemukhi photoshoot,Sreemukhi saree photo shoot,Sreemukhi,Sreemukhi ins
    Sreemukhi షేర్ చేసిన పిక్స్ Photo : Instagram


    ఇక అది అలా ఉంటే ఓ వైపు వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. ఓ సినిమాను కూడా చేస్తోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య ప్రారంభమైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటిస్తున్నారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ హాట్ యాంక‌ర్ మ‌రోసారి ప్రేమ‌లో పడ్డ‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ షోలో త‌న ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది.
    Published by:Suresh Rachamalla
    First published: