news18-telugu
Updated: May 19, 2020, 11:44 AM IST
శ్రీముఖి Photo : Twitter
శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో వివిధ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈటీవీ ప్లస్‌లో వచ్చే పటాస్ షోతో బాగా పాపులర్ అయింది శ్రీముఖి. అక్కడ వచ్చిన క్రేజ్‌తో తెలుగు రియాలీటి షో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచింది. కేవలం రియాలిటీ షోస్ మాత్రమే కాదు.. వీలున్నప్పుడల్లా సినిమాల్లోనూ కనిపించి అక్కడ కూడా అదరగొడుతోంది. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అందిరిలాగే శ్రీముఖి కూడా ఇంటికే పరిమితమైంది. దీంతో ఖాలీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ తను చిన్నప్పుడు బలపాలు బాగా తినేదాన్ని అని చెప్పింది. అయితే ఈ విషయం తెలిసిన తన ఫ్యాన్స్ బలపాలతో ఓ గిఫ్ట్‌ను కూడా ఇచ్చారని.. ఆ గిఫ్టును భద్రంగా దాచుకున్నానని పేర్కోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తనకు బిర్యానీ తినాలనీ ఉందని.. ఈ లాక్ డౌన్ పూర్తికాగానే తనకు ఇష్టమైన రెస్టారెంట్లో బిర్యానీ తింటానని తెలిపింది. ఇక శ్రీముఖి షోస్ విషయానికి వస్తే ఆమె మాటీవీలో ఓ మ్యూజికల్ ప్రోగ్రామ్ చేస్తోంది. దీనికి తోడు శ్రీముఖి ప్రస్తుతం ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమాలో నటిస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Published by:
Suresh Rachamalla
First published:
May 19, 2020, 11:44 AM IST