పార్టీ చేసుకున్న శ్రీముఖి, రాహుల్..

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం శ్రీముఖి, రాహుల్‌‌లు ఎడమొహం పెడమొహంగా ఉన్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: December 7, 2019, 11:40 AM IST
పార్టీ చేసుకున్న శ్రీముఖి, రాహుల్..
Instagram/sreemukhi
  • Share this:
శ్రీముఖి.. 'పటాస్' షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ షోకు శ్రీముఖి అల్లరి, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే పటాస్ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకున్న శ్రీముఖి తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం తోటి సభ్యుడు రాహుల్‌తో గొడవ పడుతూ వీలున్నప్పుడల్లా రాహుల్‌ను నామినేట్ చేస్తూ చూసే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఇంప్రెషన్‌తో ముందుకు సాగి చివరికి రాహుల్‌తోనే పోటి పడి మూడవ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. అయితే మూడు  నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొడుతూ ఈ సీజన్ విజయవంతం కావాడానికి తాను చేయాల్సినదంతా చేసింది. మరొక విషయం ఏమంటే రాహుల్ గెలవడానికి కారణం శ్రీముఖి అంటున్నారు నెటిజన్స్. ఆమె అలా రాహుల్‌ను టార్గెట్ చేయడం.. దీంతో చూసే ప్రేక్షకులు ఓ రకంగా ఫీల్ అయ్యి.. సైకలాజికల్‌గా రాహుల్‌కు దగ్గరయ్యారు. అది రాహుల్‌కు ఓట్ల రూపంలో కలిసిరావడంతో బిగ్‌బాస్‌ తెలుగు 3  టైటిల్‌ను రాహుల్‌ గెలుచుకున్నారు. అయితే హౌజ్‌లో ఉన్నంత కాలం శ్రీముఖి ఎక్కువగా బాబా బాస్కర్‌తో ఉంటే.. రాహుల్ మాత్రం వరుణ్, వితిక, పునర్నవిలతో ఉండేవాడు. ఈరెండు గ్రూపులకు అంతగా పడేదికాదు. అంతేకాదు ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఓ షో కోసం రాహుల్ ఆ మధ్య శ్రీముఖికి ఫోన్ చేస్తే మాట్లాడలేదని ప్రెస్ మీట్ సందర్బంగా రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే.

Instagram/sreemukhi
Instagram/sreemukhi


అయితే అదంతా మరిచిపోయిన ఈ ఇద్దరూ ఓ పార్టీలో సందడి చేశారు. దానికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే వీడియోను శ్రీముఖి తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు ఫుల్‌గా ఊగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు సద్దుమణిగి.. పూర్వ స్థితికి వచ్చారని సంతోషిస్తున్నారు వారి అభిమానులు. ఇదే విషయాన్ని శ్రీముఖి కూడా ప్రస్తావిస్తూ.. గతం గత: .. ఇక ఇప్పడే అసలైన రిలేషన్ షిప్ మొదలైందని.. పేర్కోంది.View this post on Instagram

#Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️


A post shared by Sreemukhi (@sreemukhi) on
Published by: Suresh Rachamalla
First published: December 7, 2019, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading