SREEMUKHI LATEST BATHUKU BALAIPOYINA BANDI COMEDY SHOW BS
బతుకు బలైపోయిన బండి.. కొత్త షోతో భార్యాభర్తలను కలుపుతున్న యాంకర్ శ్రీముఖి..
శ్రీముఖి బతుకు బలైపోయిన బండి షో (Youtube Photo)
శ్రీముఖి హోస్ట్‌గా జబర్దస్త్ అవినాష్, యాంకర్ విష్ణు ప్రియ భార్యభర్తలుగా కనిపించారు. లాక్డౌన్ ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు కాస్త వినోదాన్ని అందించేందుకు ఈ స్ఫూఫ్ వీడియో రూపొందించింది శ్రీముఖి.
భార్యాభర్తలు గొడవ పెట్టుకొని విడిపోతే.. వాళ్లను కలిపే టీవీ షోలు చాలానే ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ల హోస్టింగ్‌తో ఇలాంటి షోలకు మంచి రేటింగ్ కూడా దక్కుతుంది. అయితే, తానేమీ తక్కువ కాదంటోంది యాంకర్ శ్రీముఖి. అయితే, సీరియస్ సంభాషణలతో కాకుండా కామెడీతో అలరించి మెప్పించింది. శ్రీముఖి హోస్ట్‌గా జబర్దస్త్ అవినాష్, యాంకర్ విష్ణు ప్రియ భార్యభర్తలుగా కనిపించారు. లాక్డౌన్ ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు కాస్త వినోదాన్ని అందించేందుకు ఈ స్ఫూఫ్ వీడియో రూపొందించింది శ్రీముఖి. కామెడీని అందిస్తూనే భార్యభర్తలిద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి గొడవలు రావని సందేశం ఇచ్చారు. హైలైట్ ఏంటంటే.. ఈ వీడియోను శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి షూట్ చేశారు. ఆ వీడియోను శ్రీముఖి తన యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేసింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.