శ్రీముఖిని వేధిస్తున్న ఆ సమస్య... ఇప్పట్లో పరిష్కారం కానట్లే...

Sreemukhi : తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన బ్యూటీ శ్రీముఖీని ఓ సమస్య వెంటాడుతోంది. దానికి పరిష్కారం మాత్రం దొరకట్లేదు.

news18-telugu
Updated: December 14, 2019, 11:00 AM IST
శ్రీముఖిని వేధిస్తున్న ఆ సమస్య... ఇప్పట్లో పరిష్కారం కానట్లే...
శ్రీముఖిని వేధిస్తున్న ఆ సమస్య... ఇప్పట్లో పరిష్కారం కానట్లే...
  • Share this:
Sreemukhi : పటాస్ షోలో యాంకర్ రవితో కలిసి దుమ్మురేపిన శ్రీముఖీ... తెలుగు బిగ్ బాస్ 3తో మరింత ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే... టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లతోపాటూ... సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో 25 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ఐతే... ఈ సంఖ్య చాలా చిన్నది అంటోంది ఈ బ్యూటీ. అందుకు ప్రత్యేక కారణం కూడా చెప్పింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు ఉన్న క్రేజ్ చూసి... అదే శ్రీముఖీ పేరుతో... 100కు పైగా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. వాటితో శ్రీముఖీకి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ... చాలా మంది అవే అసలైన శ్రీముఖీ అకౌంట్లు అనుకుంటూ... వాటికి ఫాలోయర్లుగా చేరిపోతున్నారు. అలా చేరిన ఫాలోయర్లంతా నిజానికి తనకు దక్కాలనీ, ఆ సంఖ్యను కూడా కలిపితే... తన నిజమైన ఫాలోయర్ల సంఖ్య ఎప్పుడో 50 లక్షలు దాటేసేదన్నది ఈ బ్యూటీ ఫార్ములాగా తెలిసింది.








View this post on Instagram





Her journey in BIGBOSS is inspirational to many... Entertained in her own style and her voice resonates at every corner of the house. Say never to give up she utters all the time... to herself and others as well. There may be many ups and downs, but they are worth it and nothing stopped her.🤗 * She is a genuine soul who is always humble. * She has won all your hearts with the trust and so far her journey is 💯👌🏻 It's ur time to Vote and see your #Ramulamma as a WINNER. To Vote through Calls,📱Give a (50) Missed Calls to 8466996713 & Login to #Hotstar app and cast your (10) votes to #Sreemukhi. #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI #TeamSreemukhi #biggbosstelugu3 #StarMaa #AllRounder #Energetic


A post shared by Sreemukhi (@sreemukhi) on





ఉదాహరణకు ఇన్‌స్టాగ్రాంలో Srimukhiii అనే అకౌంట్‌కి లక్ష మంది ఫాలోయర్లు ఉన్నారు. sreemukhi1234కి 2814 మంది ఫాలోయర్లు, sreemukhiaddaకి 3367 మంది, teamsreemukhi10కి 15,600 మంది, sreemukhi17కి 3102 మంది, sreemukhi_ramulamma_fangirlకి 3866 మంది... ఇలా ఒక్కో అకౌంట్‌కీ వేలు లక్షల్లో ఫాలోయర్లు ఉంటున్నారు. ఈ అకౌంట్లన్నీ.... శ్రీముఖీ పోస్ట్ చేసే ఫొటోలను వాడుకుంటున్నవే. వీటి ఫాలోయర్లలో వారిలో కొంతమంది అవి శ్రీముఖి అకౌంట్స్ కాదని తెలిసే చేరుతున్నా... మిగతావారు మాత్రం తెలియకుండానే చేరిపోతున్నారన్నది శ్రీముఖి ఆవేదనగా తెలుస్తోంది.

ఇలాంటి అకౌంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. తన ఫొటోలు వాడుకుంటున్నారనీ, తన పర్మిషన్ లేకుండా ఇష్టమొచ్చినట్లు ఎడిటింగ్స్ చేస్తున్నారని... ఇన్‌స్టాగ్రామ్‌కి కంప్లైంట్ ఇవ్వొచ్చు. కానీ... ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే... ఇలాంటి అకౌంట్లు తెరిచేవారంతా... డైహార్డ్ ఫ్యాన్సే. వాళ్లంతా తమ అభిమాన నటుడు లేదా నటిని... దాదాపు దేవుడు, దేవతల్లా పూజిస్తారు. తమ పనులన్నీ పక్కన పెట్టి... వాళ్ల తరపున ప్రచారం చేస్తూ ఉంటారు. అందువల్ల ఇలాంటి అకౌంట్లపై శ్రీముఖీ కూడా లైట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆల్రెడీ 25 లక్షల మంది ఉన్నారు కాబట్టి... వాళ్ల అభిమానం చాలంటోంది.

ప్రస్తుతం టాలీవుడ్ వైపు చూస్తున్న శ్రీముఖీ... మరోవైపు... తనకు కలిసొచ్చిన పటాస్ షో మళ్లీ చేసేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పటాస్‌లో చలాకీ చంటీ, వర్షిణీ హోస్ట్‌గా చేస్తున్నారు. ఒకవేళ శ్రీముఖి రీ ఎంట్రీ ఇస్తే... వర్షిణీని తప్పించే అవకాశాలున్నాయి.


Pics : నడుమందాలతో కవ్విస్తున్న పూజ హెగ్డే



ఇవి కూడా చదవండి :



జబర్దస్త్‌లో మళ్లీ అదే ఫార్ములా... కలిసొస్తుందా?

Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

రైల్వే లోకో పైలెట్లకు ఫాగ్‌పాస్ యంత్రాలు... ఏంటి వాటి ప్రత్యేకత?

భర్తను చంపేందుకు భార్య షాకింగ్ ప్లాన్... చివరకు...

కూతురి పెళ్లి వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి
Published by: Krishna Kumar N
First published: December 14, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading