అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పిన శ్రీముఖి...

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది.

news18-telugu
Updated: December 4, 2019, 4:38 PM IST
అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పిన శ్రీముఖి...
Instagram/sreemukhi
  • Share this:
శ్రీముఖి.. ఈటీవీలో వచ్చే 'పటాస్' షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. పటాస్ కామెడీ షోలో శ్రీముఖి అల్లరి, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే పటాస్ షో అదిరిపోయే రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న సమయంలోనే శ్రీముఖి.. కొన్ని రోజులు విరామం తీసుకుని తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గొంది. బిగ్ బాస్ షోలో మొత్తం 17 మందిలో టాప్ టూలో నిలిచింది. అయితే మూడు  నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో గడిపిన శ్రీముఖి తన అల్లరితో, టాస్క్‌లతో ఆకట్టుకుంటూ షో విజయవంతం కావాడానికి తన వంతు కృషి చేసింది. పోటా పోటిగా జరిగిన బిగ్ బాస్ రియాలిటీషోలో రాహుల్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో శ్రీముఖి రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే షో నుండి బయటకువ వచ్చిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది.  ఇటీవలే వెకేషన్‌ను పూర్తి చేసుకుని మళ్లి తెరపై వస్తోంది. స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ అనే పేరుతో స్టార్ మాలో అదిరిపోయే ప్రోగ్రామ్ చేస్తున్నాని శ్రీముఖి చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆ ప్రోగ్రామ్ రేపు మొదలవుతోందని శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రేపు 12 గంటలకు ఈ షో ప్రారంభం కానుందని ఈ సందర్భంగా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సంతోషంతో రకరకాల కామెంట్స్ పెడుతూ వెల్ కమ్ బ్యాక్ శ్రీముఖి అంటూ స్వాగతం పలుకుతున్నారు.


సిమ్లా యాపిల్‌లా శ్రీముఖి... అదిరిపోయిన లేటెస్ట్ ఫోటోషూట్..
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading