HOME »NEWS »MOVIE »sreemukhi avinash having clashes in the case of ariyana here are the details mk

జబర్దస్త్ కమెడియన్‌కు శ్రీముఖి స్ట్రాంగ్ వార్నింగ్..హద్దు మీరితే బాగుండదంటూ..అందరి ముందూ..

జబర్దస్త్ కమెడియన్‌కు శ్రీముఖి స్ట్రాంగ్ వార్నింగ్..హద్దు మీరితే బాగుండదంటూ..అందరి ముందూ..
Instagram

ఇద్దరూ కలిసి ఓ షో చేసేలా ప్రముఖ టీవీ చానెల్ తో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అవి టాక్స్ దశలో ఉన్నాయి. అయితే శ్రీముఖి కూడా అవినాష్ కు ఈ విషయం చెప్పినట్లు సమాచారం. కానీ మనోడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానా గ్లోరీతో మంచి రిలేషన్ కనెక్ట్ అయ్యింది.

  • Share this:
    జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ అంటే యాంకర్ శ్రీముఖికి చాలా అభిమానం.. వారిద్దరి స్నేహం గురించి అందరికీ తెలిసిందే...నిజానికి బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ నేరుగా తన ఇంటికి చేరుకున్న సమయంలో శ్రీముఖి అతడికి పెద్ద సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చింది. అతడి ఇంటికి వెళ్లి గ్రాండ్ గా వెల్కం చెప్పింది. అప్పుడే వీరిద్దరి మధ్య ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ తో పాటు మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. అయితే శ్రీముఖి కూడా అదే స్థాయిలో రిలేషన్ మెయిన్ టెయిన్ చేసింది. నిజానికి అవినాష్ కెరీర్ వెనుక శ్రీముఖి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. అతడు ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో శ్రీముఖి అతడికి మంచి హెల్ప్ చేసింది. అంతే కాదు అతడికి బిగ్ బాస్ లో చాన్స్ దక్కడం వెనుక శ్రీముఖి చేసిన సిఫారసు ఉందని అంతా అంటుంటారు. అలాగే మా టీవీలో శ్రీముఖితో కలిసి అవినాష్ షో కూడా చేశాడు. తాజాగా అవినాష్ జబర్దస్త్ లో అవకాశం కోల్పోయాడు. దీంతో శ్రీముఖి అతడి కెరీర్ నష్టపోకుండా మంచి ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ షో చేసేలా ప్రముఖ టీవీ చానెల్ తో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అవి టాక్స్ దశలో ఉన్నాయి. అయితే శ్రీముఖి కూడా అవినాష్ కు ఈ విషయం చెప్పినట్లు సమాచారం. కానీ మనోడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానా గ్లోరీతో మంచి రిలేషన్ కనెక్ట్ అయ్యింది.

    నిజానికి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరికీ తెలిసిందే.. కానీ అది ఇంత గాఢంగా అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ ఇటీవల ఓ ఈవెంట్ లో రొమాన్స్ పండించారు. దీంతో అరియానా కూడా అవినాష్ ను పూర్తిగా వాడేసుకోవాలని డిసైడ్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. అయితే వీరిద్దరూ కలిసి ఓ షో చేస్తే ఎలా ఉంటుందని, ఆలోచిస్తున్నారట, ఈ విషయం తెలుసుకున్న శ్రీముఖి షాక్ కు గురైనట్లు సమాచారం.



    అవినాష్ కెరీర్ కోసం తాను తాపత్రయం పడుతుంటే అతడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇలా చేయడం ఏంటని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అయితే అవినాష్ మాత్రం అరియానా మోజులో పడి కెరీర్ నాశనం చేసుకుంటాడని, శ్రీముఖి ఒక రియల్ ఫ్రెండ్ లా ఆలోచిస్తోందని, ఆందోళన చెందుతోందని టాక్.

    అయితే ఇవేవీ పట్టని అవినాష్ మాత్రం తనకు అరియానా లాంటి అమ్మాయి క్లోజ్ అవ్వడంతో ఆ రిలేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడని, అటు శ్రీముఖితో కలిసి చేయాల్సిన షో పట్ల పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అవినాష్, శ్రీముఖి మధ్య క్లాషెస్ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇది ఏ తీరం చేరుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వార్నింగులు ఇచ్చుకునే స్థాయికి వివాదం చేరుకుందని సమాచారం.
    Published by:Krishna Adithya
    First published:January 23, 2021, 12:57 IST

    टॉप स्टोरीज