హోమ్ /వార్తలు /సినిమా /

Sreeleela: ఐ లవ్‌ యు ఇడియట్‌.. పెళ్లి సందడి భామ శ్రీలీల నయా స్టెప్

Sreeleela: ఐ లవ్‌ యు ఇడియట్‌.. పెళ్లి సందడి భామ శ్రీలీల నయా స్టెప్

Sreeleela (Photo Twitter)

Sreeleela (Photo Twitter)

I Love You Idiot Trailer: టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల పలు ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఐ లవ్‌ యు ఇడియట్‌ అనే పేరుతో ఓ యూత్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీ లీల.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైనా శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. పెళ్లి సందD (Pelli SandaD) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ సినిమాలో అమ్మడి లుక్స్, అందచందాలతో కుర్రకారు పడిపోయింది. దీంతో టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల పలు ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఐ లవ్‌ యు ఇడియట్‌ (I Love You Idiot) అనే పేరుతో ఓ యూత్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీ లీల.

అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఐ లవ్‌ యు ఇడియట్‌ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ఈ సినిమాకు ఎపి అర్జున్‌ దర్శకత్వం వహిస్తుండగా.. విరాట్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ సాయి కిరణ్‌ బత్తుల మాట్లాడుతూ..‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలను ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీ లీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.' isDesktop="true" id="1535076" youtubeid="ZaOIbPdVNxg" category="movies">

చిత్ర దర్శకుడు ఎపి అర్జున్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణు గోపాల్ గారు మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ నెల 17న వస్తోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

ప్రస్తుతం రవితేజతో ధమాకా సినిమా కూడా చేస్తోంది శ్రీ లీల. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో పాటు శ్రీలీల నటించిన పలు సినిమాలు రిలీజ్ కోసం ముస్తాబవుతున్నాయి.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు