Home /News /movies /

SREEKARAM MOVIE CLOSING COLLECTIONS AND SHARWANAND 4TH CONSECUTIVE DISASTER PK

Sreekaram closing collections: ‘శ్రీకారం’ క్లోజింగ్ కలెక్షన్స్.. శర్వానంద్‌కు వరసగా 4వ డిజాస్టర్..

శ్రీకారం శర్వానంద్ (Sharwanand Sreekaram)

శ్రీకారం శర్వానంద్ (Sharwanand Sreekaram)

Sreekaram closing collections: వ్యవసాయం కాన్సెప్టుతో కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన శ్రీకారం సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కానీ అది కలెక్షన్స్ రూపంలో మాత్రం కన్వర్ట్ కాలేకపోయింది. దాంతో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాతో కూడా డిజాస్టర్ అందుకున్నాడు శర్వానంద్.

ఇంకా చదవండి ...
శతమానం భవతి తర్వాత సరైన విజయం కోసం చూస్తున్నాడు హీరో శర్వానంద్. అప్పట్నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. భారీ అంచనాలతో వచ్చిన పడిపడి లేచే మనసు, రణరంగం, జాను లాంటి సినిమాలు కూడా ఈయన కోరుకున్న విజయం ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన సినిమా శ్రీకారం. వ్యవసాయం కాన్సెప్టుతో కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ముందు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చాలా రోజుల తర్వాత తన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శర్వానంద్ కూడా ఆనందంగా ఫీలయ్యాడు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. టాక్ బాగున్నా కూడా కమర్షియల్‌గా సేఫ్ కాలేదు శ్రీకారం. వసూళ్లు రాబట్టలేక సినిమా డిజాస్టర్ అయిపోయింది. తాజాగా ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చాయి..

నైజాం- 2.86 కోట్లు
సీడెడ్- 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.21 కోట్లు
ఈస్ట్- 0.74 కోట్లు
వెస్ట్- 0.50 కోట్లు
గుంటూరు- 0.99 కోట్లు
కృష్ణా- 0.53 కోట్లు
నెల్లూరు- 0.32 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 8.82 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.30 కోట్లు
ఓవర్సీస్- 0.52 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 9.64 కోట్లు

‘శ్రీకారం’ చిత్రానికి జరిగిన బిజినెస్ 17.1 కోట్లు. అందులో వచ్చింది కేవలం 9.64 కోట్లు. అంటే బయ్యర్లకు దాదాపు 7.86 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది శ్రీకారం. మంచి కాన్సెప్టుతో వచ్చినా కూడా ఈ సినిమాతో పాటే విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ను పూర్తిగా దత్తత తీసుకున్నారు. దాంతో శర్వానంద్‌కు వరుసగా 4వ డిజాస్టర్ తప్పలేదు. జాను, రణరంగం, పడిపడి లేచే మనసు తర్వాత శ్రీకారం కూడా లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈయన మహా సముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sharwanand, Sreekaram, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు