శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాజ రాజ చోర.. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. దొంగగా శ్రీ విష్ణు అదరగొట్టారు. అంతేకాదు తన టైమింగ్ కూడా అదిరింది. ఇక ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. హీరో ఓ మురికివాడలో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరోవైపు సాప్ట్ వేర్ అంటూ చాలా స్టైల్ గా తయారైపోయి మోసం చేస్తూంటాడు. ఈ సినిమాతో శ్రీ విష్ణుకు మంచి విజయం దక్కేలా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్గా నటించింది. మేఘ ఆకాష్ ఆ మధ్య నితిన్ సరసన లై అనే సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓ పాత్రలో మై విలేజ్ షో గంగవ్వ కూడా కనిపించింది.
ఇక ఈ సినిమాలో డైరెక్టర్ రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జూలైలోనే ఈ సినిమా విడుదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news