Home /News /movies /

SREE VISHNU BHALA THANDHANANA MOVIE TOTAL PRE RELEASE BUSINESS TA

Sree Vishnu - Bhala Thandhanana : శ్రీ విష్ణు ‘భళా తందనాన’ ఎంత బిజినెస్ చేసింది.. లాభాల్లోకి..

శ్రీ విష్ణఉు ‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

శ్రీ విష్ణఉు ‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Sree Vishnu - Bhala Thandhanana  | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తాాజాగా ఈయన నటించిన ‘భళా తందనాన’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

    Sree Vishnu - Bhala Thandhanana  | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పాతుకు పోయింది. గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. తాజాగా ఈయన ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు వచ్చారు. ‘భళా తందనాన’ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా నైజాం (తెలంగాణ)లో రూ. 1.00 కోటి.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 30 లక్షలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.55 కోట్లు వసూళ్లు చేసింది. కర్ణాటక +ఓవర్సీస్ + రెస్టాఫ్ భారత్ రూ. 15 లక్షలు బిజినెస్ చేసింది. టోటల్‌గా ఈ సినిమా రూ. 2.70 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 3 కోట్లు వసూళు చేయాలి.

    ఈ సినిమాను చైతన్య దంతలూరి డైరెక్ట్ చేసారు. వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్ఫణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ నటించింది.ఈ సినిమాతో శ్రీ విష్ణుకు మంచి విజయం దక్కుతుందా లేదా అనేది చూడాలి.

    Chiranjeevi Top Disaster Movies : ఆచార్య సహా చిరంజీవి కెరీర్‌లో టాప్ డిజాస్టర్ మూవీస్ ఇవే..

    శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ‘సెకండ్ హ్యాండ్’, ‘అసుర’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘ప్రతినిధి’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక నారా రోహిత్‌తో కలిసి సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం హీరోగా బ్రేక్ ఇచ్చింది.

    KGF 2 - RRR : కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ అరాచకం.. తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టిన రాఖీ భాయ్..


    ఆ తర్వాత హీరోగా నటిస్తూనే.. రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’ శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’, ’నీది నాది ఒకే కథ’, ‘వీర భోగ వసంతరాయలు’, ‘బ్రోచేవారేవురా’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాలు శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది వరుసగా ‘గాలి సంపత్’, ‘రాజ రాజ చోళ’ ‘అర్జున ఫల్గుణ’ చిత్రాలతో పలకరించారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయనా.. నటుడిగా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ‘భళా తందనాన’ చిత్రంతో పలకరించబోతున్నారు. ఈ చిత్రంతో శ్రీ విష్ణు మరో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bhala Thandhanana, Sree Vishnu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు