హోమ్ /వార్తలు /సినిమా /

Sree Vishnu | Alluri OTT: ప్రముఖ ఓటీటీలో శ్రీ విష్ణు అల్లూరి.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Sree Vishnu | Alluri OTT: ప్రముఖ ఓటీటీలో శ్రీ విష్ణు అల్లూరి.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Alluri OTT update Twitter

Alluri OTT update Twitter

 Sree Vishnu | Alluri OTT: శ్రీ విష్ణు (Sree Vishnu ) ‘అల్లూరి’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అల్లూరి సీతారామరాజు వలే రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Sree Vishnu - Alluri OTT | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు  (Sree Vishnu )గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పాతుకు పోయింది. గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. ఈ యేడాది ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు వచ్చారు. ఇక తాజాగా శ్రీ విష్ణు (Sree Vishnu )  ‘అల్లూరి’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అల్లూరి సీతారామరాజు వలే రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం (Alluri on Aha OTT) అక్టోబర్ 7 రాత్రి 8 గంటల నుండి ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదలైంది. అల్లూరి చిత్రం ద్వారా పోలీసు శాఖ గొప్పతనాన్ని చాటిచెప్పాలని రచయిత, దర్శకుడు ప్రదీప్ వర్మ చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు బెక్కం వేణుగోపాల్ నిర్మాత. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. కయాదు లోహర్ హీరోయిన్. సుమన్, తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర, ప్రమోదిని, పృధ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నాని విడుదల చేసారు. లక్ష్యం పెట్టుకోవడం కాదు.. దాన్ని సాధించడం గొప్ప కాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం అంటూ తనికెళ్ల భరణి హీరో శ్రీ విష్ణుకు పోలీస్ కర్తవ్యం భోధించే డైలాగులతో ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో  ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. అయితే అనుకున్న రీతిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. చూడాలి మరి ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో..  ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు.

  ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఈ సినిమా శ్రీ విష్ణు  కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోయేలా అవకాశాలున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ విష్ణు ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటించారు.  ఒకప్పటి అన్నగారి కొండవీటి సింహం, రాజశేఖర్ అంకుశం, బాలకృష్ణ రౌడీ ఇన్‌స్పెక్టర్ తరహాలో ఈ సినిమాలో శ్రీ విష్ణు పవర్‌పుల్ పోలీస్ పాత్రలో నటించారు. మన దగ్గర పోలీస్ ఆఫీసర్ పాత్రలను మన దర్శక, నిర్మాతలు పవర్‌పుల్‌గానే తీర్చిదిద్దుతారు. ఇందులో కూడా సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన రౌడీల భరతం పట్టే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణు కనిపించారు. ముఖ్యంగా పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే మరొకరు వస్తారంటూ  అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

  శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ‘సెకండ్ హ్యాండ్’, ‘అసుర’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘ప్రతినిధి’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక నారా రోహిత్‌తో కలిసి సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం హీరోగా బ్రేక్ ఇచ్చింది.

  ఆ తర్వాత హీరోగా నటిస్తూనే.. రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’ శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’, ’నీది నాది ఒకే కథ’, ‘వీర భోగ వసంతరాయలు’, ‘బ్రోచేవారేవురా’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాలు శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది వరుసగా ‘గాలి సంపత్’, ‘రాజ రాజ చోళ’ ‘అర్జున ఫల్గుణ’ ’భళా తందనాన’ చిత్రాలతో పలకరించారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయనా.. నటుడిగా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ‘అల్లూరి’ చిత్రంతో పలకరించబోతున్నారు. ఈ చిత్రంతో శ్రీ విష్ణు మరో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Alluri, Sree Vishnu, Tollywood news

  ఉత్తమ కథలు