Home /News /movies /

SREE VISHNU ALLURI MOVIE CENSOR COMPLETED AND GOT UA CERTIFICATE ISSUE AND HERE ARE THE TALK TA

Sree Vishnu - Alluri: శ్రీ విష్ణు ‘అల్లూరి’ మూవీ సెన్సార్ టాక్.. ఎలా ఉందంటే..

శ్రీ విష్ణు ‘అల్లూరి’ మూవీ సెన్సార్ టాక్ (Twitter/Photo)

శ్రీ విష్ణు ‘అల్లూరి’ మూవీ సెన్సార్ టాక్ (Twitter/Photo)

Sree Vishnu - Alluri Trailer Talk  | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఈయన ‘అల్లూరి’ సినిమాతో పలకరించబోతున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Sree Vishnu - Alluri Trailer Talk  | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పాతుకు పోయింది. గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. ఈ యేడాది ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు వచ్చారు. తాజాగా ఈయన ‘అల్లూరి’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. అల్లూరి సీతారామరాజు వలే రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో శ్రీ విష్ణు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నాని విడుదల చేసారు. లక్ష్యం పెట్టుకోవడం కాదు.. దాన్ని సాధించడం గొప్ప కాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం అంటూ తనికెళ్ల భరణి హీరో శ్రీ విష్ణుకు పోలీస్ కర్తవ్యం భోధించే డైలాగులతో ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో  ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. తాాజాగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు.
Sree Vishnu Alluri News18
’అల్లూరి’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఈ సినిమా శ్రీ విష్ణు  కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోయేలా అవకాశాలున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ విష్ణు ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటించారు.  ఒకప్పటి అన్నగారి కొండవీటి సింహం, రాజశేఖర్ అంకుశం, బాలకృష్ణ రౌడీ ఇన్‌స్పెక్టర్ తరహాలో ఈ సినిమాలో శ్రీ విష్ణు పవర్‌పుల్ పోలీస్ పాత్రలో నటించారు. మన దగ్గర పోలీస్ ఆఫీసర్ పాత్రలను మన దర్శక, నిర్మాతలు పవర్‌పుల్‌గానే తీర్చిదిద్దుతారు. ఇందులో కూడా సమాజానికి చీడపురుగుల్లా దాపురించిన రౌడీల భరతం పట్టే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణు కనిపించారు. ముఖ్యంగా పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే మరొకరు వస్తారంటూ  అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈచిత్రంలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా అల్లూరిగా శ్రీ విష్ణు చేసిన మిషన్ ఏంటి ? ఈయన స్పూర్తిగా ఎంత మంది పోలీస్ ఆఫీసర్స్‌గా మారారనేది ఈ సినిమా స్టోరీ. ప్రదీప్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ‘సెకండ్ హ్యాండ్’, ‘అసుర’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘ప్రతినిధి’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక నారా రోహిత్‌తో కలిసి సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం హీరోగా బ్రేక్ ఇచ్చింది.

Chiranjeevi@44Years in TFI: టాలీవుడ్‌లో నటుడిగా 44 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..

ఆ తర్వాత హీరోగా నటిస్తూనే.. రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’ శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’, ’నీది నాది ఒకే కథ’, ‘వీర భోగ వసంతరాయలు’, ‘బ్రోచేవారేవురా’, ‘తిప్పరా మీసం’ వంటి చిత్రాలు శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది వరుసగా ‘గాలి సంపత్’, ‘రాజ రాజ చోళ’ ‘అర్జున ఫల్గుణ’ ’భళా తందనాన’ చిత్రాలతో పలకరించారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయనా.. నటుడిగా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ‘అల్లూరి’ చిత్రంతో పలకరించబోతున్నారు. ఈ చిత్రంతో శ్రీ విష్ణు మరో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Alluri, Sree Vishnu, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు