Sree Ramachandra - Hamida: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో అన్ని రకాల రుచులు చూపిస్తున్నారు కంటెస్టెంట్ లు. బూతు మాటలతో, కాంట్రవర్సి లతో, గొడవలతో ఇలా ప్రతి ఒక్క విషయంలో కొత్త కొత్త రుచులు చూపిస్తున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్ లు. షో ప్రారంభమైన రెండు రోజులు మాత్రమే బాగా సందడి కనిపించింది. కానీ తర్వాత రోజు మాత్రం అసలైన పాత్రలు బయటపడ్డాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ అసలు రంగుని బయటపెట్టారు.
అన్ని రుచులు చూపిస్తున్న కంటెస్టెంట్ లు మరొక రుచిని తాజాగా బయటపెట్టారు. ఇంతకీ అది ఏంటో కాదు రొమాన్స్. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ ల మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్ లలో లవ్ పేరుతో ప్రేక్షకులని పిచ్చోళ్లను చేశారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడానికి మరో జంట దిగింది. ఇంతకు వాళ్ళు ఎవరో కాదు హమీదా, శ్రీ రామచంద్ర.
ఇది కూడా చదవండి:ఒసేయ్ ఉమా అంటూ రెచ్చిపోయిన అన్నీ మాస్టర్.. తూ ఛీ అంటూ హౌస్‌లో ఆడోళ్ళ రచ్చ!
ఇక వీళ్ల మధ్య మెల్ల మెల్లగా కాంట్రవర్సి నడుస్తుంది. చెప్పాలంటే ఈ జంటని చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంచి లవ్ ట్రాక్ తో నడిపిస్తారు. ఇక ఎపిసోడ్ లో వీరి మధ్య కాస్త రొమాన్స్ సీన్స్ బాగానే కనిపించాయి. నిజానికి నిన్నటి ఎపిసోడ్ లో చాలా వరకు గొడవలు అయ్యాయి. కానీ మధ్యలో ప్రేక్షకులను వారి గొడవల నుండి తప్పించడానికి ఈ సీన్ ఒకటి వేశారు. హమీదా, శ్రీరామ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉండగా.. హమీదా వీపుకు మసాజ్ చేస్తూ కనిపించాడు శ్రీరామ్.
ఇది కూడా చదవండి:మగాడివైతే రా అంటూ సన్నీకి ప్రియ స్ట్రాంగ్ సవాల్.. మాములుగా ఉండదంటూ ఎదురు?
ఇక హమీదా మాట్లాడుతూ.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది.. మళ్లీ వద్దనుకొని దూరంగా ఉండాలి అనిపిస్తుంది వెంటనే శ్రీరామ్ ఓ మై గాడ్ అంటూ.. కానీ ఇంకోటి గుర్తొస్తే ఎవరైనా ఉండకూడదు అంటూ అనేసరికి వెంటనే ఇద్దరు నవ్వుకుంటారు. ఇక కిచెన్ లో లోబో పాట పాడుతూ కనిపించగా.. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న వీరిద్దరిని ఉద్దేశించి పాడుతున్నాడని అనిపించింది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కూర్చొని ఉన్నారు. ఈ సీన్ ను చూసిన నెటిజన్లు మాత్రం తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి హౌస్ నుండి బయటకు వెళ్లే వరకు ఈ గొడవల మధ్య వీరి రొమాన్స్ ను కూడా చూడవచ్చు అని అంటున్నారు. మరికొందరు వీరి మధ్య ప్రయాణం ఎంత వరకు సాగుతుందో చూడాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Bigg Boss 5 Telugu, Hamidha, Lobo, Sree ramachandra, Star Maa