HOME »NEWS »MOVIE »sravanthi ravi kishore sensational comments on ott released movies mnj

Sravanthi Ravi Kishore: ఓటీటీ రిలీజ్‌ల‌పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఘాటు వ్యాఖ్య‌లు.. నాకు ఆ అవ‌స‌రం లేద‌న్న నిర్మాత‌

Sravanthi Ravi Kishore: ఓటీటీ రిలీజ్‌ల‌పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఘాటు వ్యాఖ్య‌లు.. నాకు ఆ అవ‌స‌రం లేద‌న్న నిర్మాత‌
స్రవంతి రవి కిశోర్

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రెడ్(Red) చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యింది. ఇక ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్లు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీల‌పై ప్ర‌ముఖ నిర్మాత స్ర‌వంతి ర‌వి కిశోర్(Sravanthi Ravi Kishore) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

  • Share this:
    Sravanthi Ravi Kishore: క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో చాలా సినిమాలు ఓటీటీలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ మొద‌లు బాలీవుడ్ వ‌ర‌కు చాలా మూవీలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల అయ్యాయి. అందులో కొన్ని స్టార్ హీరో హీరోయిన్ల చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక అప్ప‌టికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న చాలా చిత్రాలకు కూడా ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే వాటిలో కొన్ని ఆ ఆఫ‌ర్‌ల‌ను వ‌దులుకొని థియేట‌ర్లు ఓపెన్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేశాయి. అలాంటి చిత్రాల్లో రామ్ న‌టించిన రెడ్ చిత్రం ఒక‌టి. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వ‌గా.. ఓటీటీలో మాత్రం రిలీజ్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని చూప‌లేదు. ఈ క్ర‌మంలో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రెడ్ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యింది. ఇక ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్లు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీల‌పై ప్ర‌ముఖ నిర్మాత స్ర‌వంతి ర‌వి కిశోర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

    సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వాళ్లు ఎవ్వ‌రూ త‌మ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌రు అని స్ర‌వంతి ర‌వి కిశోర్ అన్నారు. థియేటర్ల‌లో విడుద‌లైన సినిమాల‌కు ఈ ప‌రిస్థితుల్లో న‌ష్టాలు వ‌స్తాయ‌ని అనుకున్నా.. ప్రేక్ష‌కులు మాత్రం సినిమాల‌ను ఆద‌రించారు. అయినా నేను డ‌బ్బుల కోసం నా సినిమాను ఓటీటీల‌కు అమ్ముకోను అని స్ర‌వంతి ర‌వి కిశోర్ అన్నారు.



    కాగా కరోనా నేప‌థ్యంలో థియేట‌ర్లు తెరిచేందుకు కేంద్రం గ‌త ఏడాదే అనుమ‌తిని ఇచ్చిన‌ప్పటికీ.. 50శాతం ఆక్యుపెన్సీకే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. థియేట‌ర్ల‌లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సంక్రాంతి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో పాటు క‌లెక్ష‌న్లను కూడా బాగా రాబ‌డుతున్నాయి. ఇక థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ని చూసి మిగిలిన ద‌ర్శ‌కనిర్మాతలు కూడా త‌మ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు విడుద‌ల తేదీల‌ను ఖ‌రారు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రంగ్ దే, అర‌ణ్య చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published:January 21, 2021, 14:21 IST

    टॉप स्टोरीज