శ్రావణి సూసైడ్ కేసు : పోలీసులకు లొంగిపోయిన నిర్మాత అశోక్‌రెడ్డి..

టీవీ నటి శ్రావణి మృతి కేసులో నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

news18-telugu
Updated: September 16, 2020, 12:46 PM IST
శ్రావణి సూసైడ్ కేసు : పోలీసులకు లొంగిపోయిన నిర్మాత అశోక్‌రెడ్డి..
అశోక్ రెడ్డి ఫైల్ ఫోటో
  • Share this:
మనసు మమత సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డితో పాటు నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడని తేల్చారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిర్మాత అశోక్‌రెడ్డి  పంజాగుట్ట పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్‌ నగర్‌ పీహెచ్‌సీకి తరలించారు. ఆ  పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ3 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

అశోక్‌రెడ్డి విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు శ్రావణి, దేవరాజ్‌‌తో క్లోజ్ అవ్వడం అశోక్‌రెడ్డికి నచ్చలేదు. దీంతో అశోక్‌రెడ్డి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పోలీసులు గుర్తించారు.  ఇక శ్రావణి విషయానికి వస్తే.. ఆమె 2012లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నించింది. 2015లో సాయి క్రిష్ణారెడ్డితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఆ తర్వాత 2017లో అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో ఆమెకు చిన్న పాత్రను ఇచ్చాడు. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. 2019లో దేవరాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఒకానొక సమయంలో దేవరాజ్‌ను పెళ్లి చేసుకోవాలని శ్రావణి అనుకుంది. అది నచ్చక సాయి, అశోక్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు వేధించారు. దేవరాజ్ కూడా మొదట్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ వీరితో సంబంధాల కారణంగా దూరం పెట్టాడు. ముగ్గురూ పెళ్లి చేసుకుంటానని చెప్పిన వారే. ఆతర్వాత వేధించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. అందులో ముఖ్యంగా మౌనరాగం, మనసు మమత లాంటీ పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరుతెచ్చుకుంది.
Published by: Suresh Rachamalla
First published: September 16, 2020, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading