అన్న ఎన్టీఆర్ చివరి కోరిక అదేనా.. అందుకే ఆయన భార్య లక్ష్మీ పార్వతి ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకుందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్టీఆర్ కన్నుమూసినప్పటి నుంచి చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూనే ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకంగా తనకంటూ ఒక వేదిక ఉండాలని వైసీపీలో జాయిన్ అయింది. టీడీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా.. తన వాయిస్‌ను బలంగా వినిస్తూనే వచ్చింది. అందుకు ప్రతి ఫలంగా ఏపీ సీఎం జగన్.. ఆమెకు తెలుగు అకాడమీ చైర్మన్‌గా నియమించారు. స్వతహాగా ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఎక్కడ పెద్దగా ప్రతిఘటనలు ఎదురుకాలేదు. ఒక రకంగా ఎన్టీఆర్ ఆమెను ఏదో ఒక ప్రభుత్వ పదవిలో చూడాలనుకున్న ముచ్చట ఇన్నాళ్లకు ఈ పదవితో తీరిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరోవైపు ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి సినిమాల్లో యాక్ట్ చేస్తే చూడాలని కోరిక అట. అందుకే ఆమె త్వరలో వెండితెరపై తెరంగేట్రం చేయబోతుంది.
ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసి.. మధ్యలో ‘ఢమరుకం’ వంటి సోషియో ఫాంటసీతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తాజాగా ఈయన రాగల 24 గంటల్లో సినిమాతో వచ్చాడు. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ రెడ్డి తర్వాతి సినిమాను ముస్కాన్ సేథీతో ఈమెతోనే చేయబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ రాధాకృష్ణ. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో నటించబోతుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో లక్ష్మీ పార్వతి కథను మలుపుతిప్పే పాత్రలో కనిపించనుంది. మొత్తానికి 64 ఏళ్ళ వయసులో లక్ష్మీ పార్వతి సినిమాల్లో నటిస్తూ అన్నగారు తనను వెండితెరపై చూడాలనుకున్న కోరికను ఈ రకంగా నెరవేర్చుకుంటుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Lakshmi Parvathi, NTR, TDP, Telugu Cinema, Tollywood, Ysrcp