తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ, టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్. ఇక తెలుగునాట హిందీ రీమేక్ మూవీస్‌కు అప్పట్లోనే ఓ స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిందీ యన్టీఆరే. ఆయన తన 52వ ఏట ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్ లో నటించగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పోలీస్ కేరెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ‘నిప్పులాంటి మనిషి’ సినిమా. ఈ చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ కు రీమేక్. ఆ చిత్రంలో నటించే సమయానికి అమితాబ్ వయసు 32ఏళ్లు. యాంగ్రీ యంగ్ మేన్ గా అమితాబ్‌కు ఆ చిత్రం మంచిపేరు తీసుకొచ్చింది. అదే సినిమాను యన్టీఆర్ 52 ఏళ్ళ వయసులో అదే పాత్రతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అదే 52 ఏళ్ళ వయసు వచ్చేసరికి అమితాబ్ కేరెక్టర్ రోల్స్‌కి పరిమితమవ్వడం గమనార్హం.
ఈ జంజీర్ సినిమాను అదే టైటిల్‌తో రామ్ చరణ్ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా అమితాబ్ బచ్చన్ నటించిన పలు సినిమాలను తెలుగు ప్రేక్షకులు కోసం రీమేక్ చేసారు. అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్ లో చేసిన మరో మూవీ ‘దో అంజానే’. ఈ సినిమాను ఎన్టీఆర్ ‘మా వారి మంచితనం’ పేరుతో రీమేక్ చేసారు. ఇక బిగ్‌బీ ‘దీవార్’ను ఎన్టీఆర్..‘మగాడు’గా రీమేక్ చేసిన సక్సెస్ అందుకున్నారు.
ఇక సీనియర్ బచ్చన్ ‘డాన్’ గురించైతే మాట్లాడుకునేదే లేదు. ఈ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశాడు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశాడు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇక తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
‘హేరాఫేరి’.. అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్లో ఇదొకటి. ఈ అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని హిందీలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా చేశాడు. తెలుగులో నందమూరితో అక్కినేని కలిశారు అందుకే ‘రామకృష్ణులు’ అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ స్వీట్ మెమరీ. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘సత్యం శివం’. ఇది కూడా బాలీవుడ్‌లొ అమితాబ్ బచ్చన్ శశి కపూర్‌తో చేసిన ‘సుహాగ్’ సినిమాకి రీమేకే.
అమితాబ్ సినిమాల్లో ‘లావారిస్’ సినిమాను ఎవ్వరూ మరిచిపోలేరు. బిగ్ బీ బిగ్ హిట్టైన ‘లావారిస్’ మూవీని తెలుగులో మళ్లీ ఎన్టీఆర్ ‘నా దేశం’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ మూవీ విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం చేసారు. ఐతే ఎన్టీఆర్ నటించిన ఏ సూపర్ హిట్ సినిమాను అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయకపోవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, NTR, Telugu Cinema, Tollywood