1977 సీనియర్ ఎన్టీఆర్‌కి చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?

Sr NTR: నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని కాదు గ్రంథాన్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 3:43 PM IST
1977 సీనియర్ ఎన్టీఆర్‌కి చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?
నందమూరి తారక రామారావు (Twitter/NTR)
  • Share this:
నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని కాదు గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఆదర్శప్రాయం. అలాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఓ చిన్న కథ తెలుసుకుందాం. అది 1977.. అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒకప్పటిలా మాత్రం విజయం సాధించడం లేదు. బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నాడు కానీ బాక్సాఫీస్ బద్దలైపోయే రికార్డులు మాత్రం రావడం లేదు.

సీనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో
సీనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో


దానికి తోడు కృష్ణ, శోభన్ బాబు లాంటి కొత్తతరం హీరోలు కూడా రావడంతో కాస్త జోరు తగ్గించారు అన్నగారు. అయితే వయసైపోతుంది కదా అని ఊరికే ఉండలేదు.. జూలు విదిల్చిన సింహంలా ఆయన గర్జించాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. మరోవైపు నందమూరి అభిమానులు కూడా తమ హీరో విజృంభన కోసం చూస్తున్న తరుణంలో ఆ సమయం రానే వచ్చింది. ఒకే ఏడాది ఏకంగా మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి ఎన్టీఆర్ అంటే ఏంటో మరోసారి నిరూపించాడు తారకరాముడు.

ఎన్టీఆర్ డివిఎస్ కర్ణ (NTR DVS Karna)
ఎన్టీఆర్ డివిఎస్ కర్ణ (NTR DVS Karna)


1977.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ఎన్టీఆర్ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు చెంపపెట్టు ఆ ఏడాది. తాను ఒక్కసారి మనసు పెడితే ఎలాంటి సినిమాలు వస్తాయనేది 1977 చూపించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. తనే దర్శకుడిగా, నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేసాడు ఎన్టీఆర్. కేవలం 43 రోజుల్లోనే డివిఎస్ కర్ణ లాంటి అద్భుతాన్ని తెరకెక్కించాడు.

ఎన్టీఆర్ అడవి రాముడు (NTR Adavi Ramudu)
ఎన్టీఆర్ అడవి రాముడు (NTR Adavi Ramudu)


ఇక ఆ సినిమా ప్రభంజనం ఇంకా మరిచిపోకముందే ఎప్రిల్ 28న అడవి రాముడు విడుదలై అప్పట్లోనే 3.25 కోట్లు వసూలు చేసింది. కే రాఘవేంద్రరావు ఈ చిత్రంతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అది కూడా ఇండస్ట్రీ హిట్.. ఇక ఏడాది చివర్లో అక్టోబర్ 21న యమగోల విడుదలైంది. అది కూడా ఇండస్ట్రీ హిట్. తాతినేని రామారావు తెరకెక్కించిన ఈ చిత్రంలో అప్పట్లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై చాలా సెటైర్లు వేసాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ యమగోల (NTR Yamagola)
ఎన్టీఆర్ యమగోల (NTR Yamagola)


అలా 1977లో మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే.. అందులో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన చరిత్ర ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో అన్నగారికి తప్ప మరొకరికి సాధ్యం కాలేదు. అదే ఏడాది ఏఎన్నార్‌తో కలిసి చాణక్య చంద్రగుప్తలో కూడా నటించాడు. ఎదిరీత, మా ఇద్దరి కథ సినిమాలు కూడా 1977లోనే విడుదలయ్యాయి.
Published by: Praveen Kumar Vadla
First published: May 28, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading