నెట్‌ఫ్లిక్స్ (Netflix) యొక్క స్క్విడ్ గేమ్ ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT షోలలో ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ప్రీమియర్ల ప్రారంభ వారం నుంచి రికార్డు వీక్షకుల సంఖ్యను నమోదు చేసింది. ఇప్పుడు, తెలుగు నెట్‌ఫ్లిక్స్ OTT ప్రేక్షకులకు జోష్ నింపేలా స్క్విడ్ గేమ్ (Squid Game) తెలుగు భాషలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం స్క్విడ్ గేమ్ తెలుగు, తమిళ ఆడియో వెర్షన్లలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే భాష పరమైన భేదం లేకుండా తెలుగు మరియు తమిళ భాషల్లో చాలా మంది స్క్విడ్ గేమ్ వీక్షించారు. తాజాగా ప్రాంతీయ భాషల్లో వచ్చే ఈ వర్షన్ వీక్షకులను ఎంతో ఆకట్టుకొంటుంది అనడంలో సందేహం లేదు అంటున్నాయి నెట్‌ఫ్లిక్స్ వర్గాలు.
ఏమంది స్క్విడ్ గేమ్‌లో..
కొన్ని కథలు.. వినడానికి బాగుంటాయి, కొన్ని కథలు చూడడానికి బాగుంటాయి. కానీ అదే జీవితంలో జరిగితే భయంకలిగిస్తాయి. అలాంటి కథే స్క్విడ్ గేమ్. ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ (Web Series) ప్రారంభిస్తే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ కొత్త లోకంలోకి వెళ్లి చూస్తుంటాం. స్క్విడ్ గేమ్ (Squid Game) ప్రపంచంలో అత్యంత ప్రజాధరణతో నడుస్తున్న వెబ్‌సిరీస్.
Ready to play? Squid Game is now streaming in Tamil and Telugu?❌⭕️ pic.twitter.com/WYUFZHhpAX
— Netflix India South (@Netflix_INSouth) December 6, 2021
కథ ఏమిటీ?
స్క్విడ్ గేమ్‌లో అప్పుల్లో కూరుకుపోయి. ఆర్థికంగా ఎక్కడా ఎదిగేందుకు దారిలేని స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా.. ఒక్కసారి సీజన్ (Season) ప్రారంభిస్తే పూర్తయ్యేదాకా వదలడం కష్టం. కథ ప్రారంభమయ్యాక ఏం చెప్పాలనుకొంటున్నాడో మనకు అర్థం అవుతుంది.
Also Read - Squid Game : ఎందుకింత క్రేజ్.. ఏముందీ ఈ "స్క్విడ్ గేమ్"లో..
కానీ ఏం జరుగుతుందో ఉహించలేం. పకడ్బందీగా స్క్రిప్ట్ (Script).. మనసుకు తగిలే సన్నివేశాలు.. వీక్షకుడిని కట్టిపడేస్థాయి. పూర్తిగా దక్షిణ కొరియా నటులు నటిస్తున్నా.. ఎక్కడా వేరే భాష సిరీస్ (Series) చూస్తున్నాం అనే భావన కలగదు. ఎందుకంటే కథను అందరికీ కనెక్టయ్యేలా చూపించారు.
మనకు ఏ పాత్రపై ప్రత్యేక అంచనా ఉండదు కాబట్టి ఈ సిరీస్‌ను చాలా ఎంజాయ్ చేస్తాం. సీరిస్ చివర్లో వచ్చే పతాక సన్నివేశాలు.. ఎందుకు ఇలాంటి ఆట ఆడించాల్సి వచ్చిందో గేమ్ సృష్టికర్త చెబుతున్నట్టు ఉంటుంది. హీరోకి అతనికి సంభాషణలు చాలా బాగా ఉన్నాయి. మాటలు కూడా గేమ్‌లానే అనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారు మాట్లాడుకోరు సమాజం స్వభావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మనకు ప్రశ్నలను రేకెత్తిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netflix, Ott, Telugu Movie, Web Series