Squid Game : ఎందుకింత క్రేజ్‌.. ఏముందీ ఈ "స్క్విడ్ గేమ్‌"లో..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఫోటో సోర్స్‌ - నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌)

Squid Game : కొన్ని క‌థ‌లు.. విన‌డానికి బాగుంటాయి, కొన్ని క‌థ‌లు చూడ‌డానికి బాగుంటాయి. కానీ అదే జీవితంలో జ‌రిగితే భ‌యం క‌లిగిస్తాయి. అలాంటి క‌థే స్క్విడ్ గేమ్‌. ఒక్క‌సారి ఈ సిరీస్ ప్రారంభిస్తే మ‌న చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఓ కొత్త లోకంలోకి వెళ్లి చూస్తుంటాం.

 • Share this:
  కొన్ని క‌థ‌లు.. విన‌డానికి బాగుంటాయి, కొన్ని క‌థ‌లు చూడ‌డానికి బాగుంటాయి. కానీ అదే జీవితంలో జ‌రిగితే భ‌యంక‌లిగిస్తాయి. అలాంటి క‌థే స్క్విడ్ గేమ్‌. ఒక్క‌సారి ఈ సిరీస్ ప్రారంభిస్తే మ‌న చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఓ కొత్త లోకంలోకి వెళ్లి చూస్తుంటాం.  స్క్విడ్ గేమ్ (Squid Game) ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ‌తో న‌డుస్తున్న వెబ్‌సిరీస్‌.. ఏముంది స్క్విడ్ గేమ్‌లో. ఒక్కమాట‌లో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే. అప్పుల్లో కూరుకుపోయి. ఆర్థికంగా ఎక్క‌డా ఎదిగేందుకు దారిలేని స్థితిలో ఉన్న పేద‌ల‌ను ఒక చోట చేర్చి.. వారితో ఆట‌లు ఆడిస్తుంటే చూసి ఎంజాయ్  చేస్తుంటారు. విన‌డానికి చిన్న క‌థ‌లా అనిపిస్తున్నా.. ఒక్క‌సారి సీజ‌న్ (Season) ప్రారంభిస్తే పూర్త‌య్యేదాకా వ‌దల‌డం క‌ష్టం. క‌థ ప్రారంభ‌మ‌య్యాక ఏం చెప్పాల‌నుకొంటున్నాడో మ‌న‌కు అర్థం అవుతుంది. కానీ ఏం జ‌రుగుతుందో ఉహించ‌లేం. ప‌క‌డబ్బందీ స్క్రిప్ట్‌ (Script).. మ‌న‌సుకు త‌గిలే స‌న్నివేశాలు.. వీక్ష‌కుడిని క‌ట్టిప‌డేస్థాయి. పూర్తిగా ద‌క్షిణ కొరియా న‌టులు న‌టిస్తున్నా.. ఎక్క‌డా వేరే భాష సిరీస్ (Series) చూస్తున్నాం అనే భావ‌న క‌ల‌గ‌దు. ఎందుకంటే క‌థ‌ను అంద‌రికీ క‌నెక్ట‌య్యేలా చూపించారు.

  ఏముంది ఇందులో..
  ఏపిసోడ్-1 ప్రారంభంలోనే డైరెక్ట‌ర్ (Director) మ‌న‌కు ఏం చెప్ప‌బోతున్నాడో అర్థం అవుతుంది. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉండి ఏ దారి తోచ‌ని 456 మందిని ఎంపిక చేయ‌డం వారిని గేమ్‌లోకి తీసుకొంటారు. వారంద‌రితో కాంట్రాక్టు (Contract) కుదుర్చొకొని భారీ ప్రైజ్ మ‌నీతో గేమ్ ప్రారంభిస్తారు. చిన్న‌త‌నంలో మనం వీడియో గేమ్ ఆడుతాం. స‌రిగా ఆడ‌కుంటే ఎలిమినేట్ అయిపోతాం.

  F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన..


  వీడియో గేమ్ భాష‌లో లైఫ్ పోతుంది. ఇక్క‌డా అంతే గేమ్ స‌రిగా ఆడ‌కున్నా త‌ప్పుకున్నా ఎలిమినేట్ (Eliminate) అయిపోతారు. అంటే చనిపోవాల్సిందే.. ఇక్క‌డే ద‌ర్శ‌కుడు వీక్ష‌కుల‌ను క‌న్ను తిప్పుకోకుండా చేశాడు. ఎన్నో భావోద్వేగాలతో (Emotions) ఆటలు కొన‌సాగుతుంటాయి.  ఏం జ‌రుగుతుంది.. ఎలా గేమ్ ఆడ‌తారు అని మ‌నం క‌థ‌లో పూర్తిగా లీన‌మైపోతాం.

  "ఒక్క‌సారి ఆ పురాణాలు దాటి వ‌చ్చి చూడు.. అవ‌స‌రాల కోసం దార్లు తొక్కే పాత్ర‌లు త‌ప్ప‌.. హీరోలు విల‌న్లు లేరీ నాట‌కంలో" ఇది ప్ర‌స్థానం సినిమాలో సాయికుమార్ గంభీరంగా చెప్పిన డైలాగ్‌. స్క్విడ్ గేమ్ మొద‌లు కాగానే.. కాసేప‌టికే మ‌న‌కు ఈ విష‌యం అర్థం అయిపోతుంది. త‌న‌దాక వ‌స్తే మ‌నిషి ఏమైనా చేస్తాడు అని ఒప్పించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఇది 100శాతం స‌రైంది కాకున్నా మెజార్టీలో స‌రైన వాద‌నే.. ఎంత మంచిగా ఉన్నా.. తాను చ‌స్తాను అని తెలిస్తే మ‌నిషి ఎంత‌కైనా తెగిస్తాడు. అనే ఒక్క లైన్ మీద క‌థ‌ను గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌డం అనేది స్క్రిప్ట్ స‌త్తానే.

  ముఖ్యంగా గోళీల ఆట (Marbles Game) ఈ సీజ‌న్‌లో ఎక్కువ ఎమోష‌న్ ఉన్న గేమ్‌. క‌చ్చితంగా ఇది మ‌నలో ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తుంది. దాని గురించి చెప్ప‌డం క‌న్నా చూస్తేనే అర్థం అవుతుంది. ఏరికోరి ఎంచుకొన్న వారితోనే పోటీ ప‌డాలి. ఒక్క‌రే గెల‌వాలి. అంటే ఒక్క‌రే బ‌త‌కాలి అని తెలిస్తే ఎంత క‌ఠినంగా ఉంటుందో.. ద‌ర్శ‌కుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. ఈ ఏపిసోడ్ చివ‌రిలో ఆట‌గ‌ళ్లు ఎంతో మాన‌సికంగా కుంగిపోతారో.. వీక్ష‌కుడి హృద‌యం అంత బ‌రువెక్కుతుంది. నువ్వు ఉంటే నాకు బ‌లం అని ఓ మిత్రుడిని ఎంచుకొన్న స్నేహితుడు.. త‌న అస్తిత్వం కోసం అత‌న్నే దెబ్బ‌తీయ‌డం.. ఒక‌రి ఓట‌మి మీద ఇంకొక‌రు గెల‌వ‌డం. ఇవ్వ‌న్ని మ‌న‌ల్ని క‌థ‌లో లీనం చేస్తాయి.

  మ‌న‌కు ఏ పాత్రపై ప్ర‌త్యేక అంచనా ఉండ‌దు కాబ‌ట్టి ఈ సిరీస్‌ను చాలా ఎంజాయ్ చేస్తాం. సీరిస్ చివ‌ర్లో వ‌చ్చే ప‌తాక‌ స‌న్నివేశాలు.. ఎందుకు ఇలాంటి ఆట ఆడించాల్సి వ‌చ్చిందో గేమ్ సృష్టిక‌ర్త చెబుతున్న‌ట్టు ఉంటుంది. హీరోకి అత‌నికి సంభాష‌ణ‌లు చాలా బాగా ఉన్నాయి. మాట‌లు కూడా గేమ్‌లానే అనిపిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే వారు మాట్లాడుకోరు స‌మాజం స్వ‌భావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మ‌న‌కు ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తారు.

  సిరీస్ పేరు - స్క్విడ్ గేమ్‌ (Squid Game)
  ఎపీసోడ్‌లు - 9
  ఓటీటీ - నెట్‌ఫ్లిక్స్‌
  భాష‌- ఇంగ్లీష్‌
  Published by:Sharath Chandra
  First published: