Byreddy Siddharth Reddy: బంజారాహిల్స్‌లో గండికోట రెస్టారెంట్‌ను ప్రారంభించిన బై రెడ్డి సిద్దార్థ రెడ్డి..
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి (byreddy siddhartha reddy)
Byreddy Siddharth Reddy: గండికోట రెస్టారెంట్ పరిసరాలు అంతకుమించి చక్కటి సర్వీస్ తో వచ్చిన అతిధులకు మరింత అదనపు ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందిస్తాయని బై రెడ్డి సిద్దా రెడ్డి అన్నారు. ప్రసిద్ధిచెందిన గండికోట రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
గండికోట రెస్టారెంట్ పరిసరాలు అంతకుమించి చక్కటి సర్వీస్ తో వచ్చిన అతిధులకు మరింత అదనపు ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందిస్తాయని బై రెడ్డి సిద్దా రెడ్డి అన్నారు. ప్రసిద్ధిచెందిన గండికోట రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్దారెడ్డి మాట్లాడుతూ రుచుల రాజధాని అయిన హైదరాబాద్ లో గండికోట రెస్టారెంట్ ఆకట్టుకునే ఇంటిరియర్స్, ఆత్యధునిక లాంజ్, అత్యంత రుచికరమైన ఇండియన్ క్యుజిన్స్ ను గండికోట రెస్టారెంట్ బంజారాహిల్స్ వాసులకు చేరువ చేసిందన్నారు. చవులూరించే రుచులతో పాటుగా అంతుకు ధీటైన సర్వేస్, సమున్నతంగా డిజైన్ చేసిన పరిసరాలతో ఈ రెస్టారెంట్ అతిధులకు వినియోగదారులకు చక్కని అనుభూతిని అందిస్తుందన్నారు.
రెస్టారెంట్లో విద్యుత్ వెలుగులు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తాయన్నారు. చక్కని వ్యూ, అద్బుతమైన పరిసరాలను అత్యంత రుచికరమైన ఆహారాన్ని అభిలషించే యువ, నగరవాసులను దృష్టి లో ఉంచుకుని రూపుదిద్దు కుందన్నారు వైవిద్యాన్ని కోరుకునే కస్టమర్లకు నిజమైన ఎంపికగా ఈ రెస్టారెంట్ అని బై రెడ్డి సిద్దారెడ్డి పేర్కొన్నారు. గండికోట రెస్టారెంట్ మేనేజింగ్ పార్టనర్స్ సుదీర్, పవిత్ర, దీక్షిత్ మరియు సాయి మాట్లాడుతూ కుటుంబంతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చే వారిని చక్కని విందుతోపాటు అద్బుతమైన పరిసరాలతో మా రెస్టారెంట్ ఆకట్టుకుంటుoదని తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యకమలో వర్ధమాన నటులు మరియు మోడల్స్ పాల్గొన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.