మార్వెల్(Marvel) ఫాన్స్ ఇటు.. స్పెడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ (Spider Man No way Home). ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్ విడుదల చేసింది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సిమాను ఇండియాలో ఒక రోజు ముందే విడుదల చేయనున్నట్టు సోనీపిక్చర్స్ అధికారికంగా ట్విట్టర్ (Twitter) ఖాతలో ప్రకటించింది. దీంతో సూపర్ హీరో ఫ్యాన్స్ అమెరికా కన్నా ముందుగానే ఇండియాలో సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. కచ్చితంగా ఫ్యాన్స్ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
We have some exciting news for all the Spider-Man & Marvel fans! Our favourite superhero will be swinging in one day earlier than the US! Catch #SpiderManNoWayHome on December 16 in English, Hindi, Tamil & Telugu. pic.twitter.com/uUNQNJ7e3h
— Sony Pictures India (@SonyPicsIndia) November 29, 2021
ఏం ఉంది ట్రైలర్లో..
స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అందరకీ తెలిసి పోతుంది. ఈ నేపథ్యంలో తనతో ఉన్నవారు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి డాక్టర్ స్ట్రేంజ్ సాయం కోరుతాడు.
Bank Exam Preparation: ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చదవాలి?
ప్రత్యేక మంత్రంతో అందరినీ తాను స్పైడర్ మ్యాన్ అని మర్చిపోయేలా చేయమని కోరుతాడు. దీనికి డాక్టర్ స్ట్రేంజ్ ఒప్పుకొంటాడు. అయితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలతో సమాంతర భూగ్రహాల నుంచి స్పైడర్ శత్రువులు భూమిపైకి వస్తారు. వారిని ఎలా ఎదుర్కొంటూ స్రైడర్ మ్యాన్ చేసే సాహసాలకు సంబంధించిన సీన్స్‌ను చూపించారు.
గతంలో స్పైడర్ మ్యాన్ పాత్ర పోషించిన టూబే మాగ్యూర్, ఆండ్య్రూ గారీఫీల్డ్ కూడా వీరిని ఎదరించడానికి వస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సీన్లు లేకున్నా.. హింట్ మాత్రం ఇచ్చారు. డాక్టర్ ఆక్టోపస్ స్రైడర్ మ్యాన్ ని పట్టుకొని "యూ ఆర్ నాట్ పీటర్ పార్కర్" అంటాడు. అంతే కాకుండా సాండ్ మ్యాన్, ఎలక్ట్రోలను, కూడా ఫైట్‌లో చూపించారు. ఈ నేపథ్యంలో స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో లీడ్ రోల్ చేసిన టూబే మాగ్యూర్, ఆండ్య్రూ గారీఫీల్డ్ ఉంటారని ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకేసారి కనపడాలని కోరుకుంటూ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hollywood, Telugu movies, Twitter