స్పైడర్ మ్యాన్ -నో వే హోమ్ (Spider-Man No Way Home), టామ్ హాలండ్ టైటిల్ సూపర్ హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 16, 2021న ఇండియాలో విడుదలైంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు మార్క్‌ను దాటింది. ఇటీవల కాలంలో ఏ హాలీవుడ్ మూవీకి రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఇండియాలో వచ్చాయి. దాదాపు మల్టీ ప్లెక్స్‌లు అన్నీ ఈ సినిమాతో కళకళలాడాయి. ఈ చిత్రం మొదటి ఆదివారం ₹29.23 కోట్లు వసూలు చేసింది, దేశీయ బాక్సాఫీస్ (Box Office) వద్ద మొత్తం ₹108.37 కోట్లు వసూలు చేసింది. దీని గ్రాస్ కలెక్షన్ ₹138.55 కోట్లు, ఇది భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన స్పైడర్ మాన్ చిత్రంగా నిలిచింది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రోజులలో 32.67 కోట్లు, శుక్రవారం 20.37 కోట్లు , శని 26.10 కోట్లు, ఆది 29.23 కోట్లు. మొత్తం: ₹108.37 కోట్లు వసూలు చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
#SpiderMan casts its web at the #BO… Posts MASSIVE TOTAL in its *extended* 4-day weekend… Emerges HIGHEST GROSSING FILM for #SonyIndia in 4 days… All eyes on weekdays… Thu 32.67 cr, Fri 20.37 cr, Sat 26.10 cr, Sun 29.23 cr. Total: ₹ 108.37 cr Nett BOC. #India biz. pic.twitter.com/dsDoVZ4ot5
— taran adarsh (@taran_adarsh) December 20, 2021
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'స్ డే వన్ కలెక్షన్ కోవిడ్ కంటే ముందు 2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ కంటే 3.5 రెట్లు ఎక్కువ. ఇది 2019 చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత భారతదేశంలో హాలీవుడ్ (Hollywood) విడుదలల చరిత్రలో రెండవ అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
ఇండియాలో ముందే విడుదల..
ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే డిసెంబర్ 16, 2021న విడుదల చేశారు. అమెరికాకన్నా ముందే ఇండియాలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇటీవల కాలంలో ఏ హాలీవుడ్ మూవీకి రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఇండియాలో వచ్చాయి. దాదాపు మల్టీ ప్లెక్స్‌లు అన్నీ ఈ సినిమాతో కళకళలాడాయి. అయితే డిసెంబర్ 17, 2021న అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప కారణంగా కలెక్షన్‌లు బాగా తగ్గాయి. ఈ సినిమా ఈ చిత్రం రూ.32.67 కోట్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ సూర్యవంశీని (Suryavanshi) వెనక్కు నెట్టింది. శుక్రవారం ₹20.37 కోట్లు వసూలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.