స్పైడర్ మ్యాన్ -నో వే హోమ్ (Spider-Man No Way Home), టామ్ హాలండ్ టైటిల్ సూపర్ హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 16, 2021న ఇండియాలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. ఇండియాలోనూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా కరోనా తరువాత ఇంత వేగంగా వసూళ్లు రాబట్టడం ప్రధానంగా సినీ విశ్లేషకులను ఆకట్టుకొంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.164.92కోట్లు వసూలు చేసింది. అతి త్వరలో రూ.175కోట్ల మార్క్ అందుకుటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరుతుందని . ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
#SpiderMan challenges its opponents, continues its triumphant march… Biz jumps again on [second] Sat [+49.63%]… Targets ₹ 200 cr+ *lifetime biz*… Is SUPER-HIT. On course to be a BLOCKBUSTER... [Week 2] Fri 6.75 cr, Sat 10.10 cr. Total: ₹ 164.92 cr Nett BOC. #India biz. pic.twitter.com/QP25HH7DrO
— taran adarsh (@taran_adarsh) December 26, 2021
జుమాంజీ చిత్రాన్ని దాటేసింది..
అంతే కాదు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్‌ల చరిత్ర సృష్టిఓంది. ఈ సినిమా ఇప్పటికే 1 బిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్‌లు వసూలు చేసింది. ఇప్పటి వరకు US బాక్సాఫీస్ వద్ద USD 405.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 2017 నాటి జుమాంజి: వెల్‌కమ్ టు ది జంగిల్‌ను అధిగమించింది, ఇది ఇప్పటివరకు USD 404.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు సాధించింది.
Mouni Roy: కళ్లు జిగేల్ మనే డ్రెస్‌లో.. హాట్ బ్యూటీ మౌని రాయ్ లేటెస్ట్ పిక్స్
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'స్ డే వన్ కలెక్షన్ కోవిడ్ కంటే ముందు 2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ కంటే 3.5 రెట్లు ఎక్కువ. ఇది 2019 చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత భారతదేశంలో హాలీవుడ్ (Hollywood) విడుదలల చరిత్రలో రెండవ అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
Shanaya Kapoor: లేటెస్ట్ హాటెస్ట్ లుక్స్ బ్యూటీ షనాయా కపూర్.. ఫోటో షూట్
ఇండియాలో ముందే విడుదల..
ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే డిసెంబర్ 16, 2021న విడుదల చేశారు. అమెరికాకన్నా ముందే ఇండియాలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇటీవల కాలంలో ఏ హాలీవుడ్ మూవీకి రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఇండియాలో వచ్చాయి. దాదాపు మల్టీ ప్లెక్స్‌లు అన్నీ ఈ సినిమాతో కళకళలాడాయి. అయితే డిసెంబర్ 17, 2021న అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప కారణంగా కలెక్షన్‌లు బాగా తగ్గాయి. ఈ సినిమా ఈ చిత్రం రూ.32.67 కోట్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ సూర్యవంశీని (Suryavanshi) వెనక్కు నెట్టింది. శుక్రవారం ₹20.37 కోట్లు వసూలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.