Spider Man No Way Home | స్పైడర్ మ్యాన్ -నో వే హోమ్, టామ్ హాలండ్ టైటిల్ సూపర్ హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 16, 2021న ఇండియాలో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. ఇండియాలోనూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలివుడ్ మూవీల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది.
స్పైడర్ మ్యాన్ -నో వే హోమ్ (Spider-Man No Way Home), టామ్ హాలండ్ టైటిల్ సూపర్ హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 16, 2021న ఇండియాలో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. ఇండియాలోనూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా కరోనా తరువాత ఇంత వేగంగా వసూళ్లు రాబట్టడం ప్రధానంగా సినీ విశ్లేషకులను ఆకట్టుకొంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.202.34 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలివుడ్ చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఓ వైపు తెలుగు పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa), కపిల్ దేవ్ బయోపిక్ 83 విడుదల అయినా కూడా డబ్బింగ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోం కలెక్షన్‌లను తగ్గించలేకపోతున్నాయి. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్పైడర్ మ్యాన్ సినిమా వీక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పటి వరకు ఇండియాలో అవేంజర్ ఎండ్ గేమ్ 367.43 కోట్లు, అవేంజర్ ఇన్‌ఫినిటీ వార్ 228.50 కోట్లు వసూలు చేశాయి. తాజాగా స్పైడర్ మ్యాన్ నో వే హోం 202.34 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. కరోనా కారణంగా జనం ఎక్కువగా థియేటర్లు రాని పరిస్థితి అంతే కాకుండా పాన్ ఇండియా మూవీ పుష్ప, కపిల్ దేవ్ బయోపిక్ 83 విడుదలైనా కూడా తట్టుకొని ఈ సినిమా విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉందని సినిమా పండితులు చెబుతున్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరుగుదల లేకుంటే కలెక్షన్‌లు ఇంకా భారీగా ఉండేవని నిపుణులు చెబుతున్నారు.
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్'స్ డే వన్ కలెక్షన్ కోవిడ్ కంటే ముందు 2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ కంటే 3.5 రెట్లు ఎక్కువ. ఇది 2019 చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత భారతదేశంలో హాలీవుడ్ (Hollywood) విడుదలల చరిత్రలో రెండవ అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
సోనీ పిక్చర్ జుమాంజీ చిత్రాన్ని దాటేసింది..
అంతే కాదు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్‌ల చరిత్ర సృష్టిఓంది. ఈ సినిమా ఇప్పటికే 1 బిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్‌లు వసూలు చేసింది. ఇప్పటి వరకు US బాక్సాఫీస్ వద్ద USD 405.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 2017 నాటి జుమాంజి: వెల్‌కమ్ టు ది జంగిల్‌ను అధిగమించింది, ఇది ఇప్పటివరకు USD 404.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు సాధించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.