స్పైడర్ మ్యాన్ -నో వే హోమ్ (Spider-Man No Way Home), టామ్ హాలండ్ టైటిల్ సూపర్ హీరోగా నటించిన చిత్రం డిసెంబర్ 16, 2021న ఇండియాలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. ఇండియాలోనూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా కరోనా తరువాత ఇంత వేగంగా వసూళ్లు రాబట్టడం ప్రధానంగా సినీ విశ్లేషకులను ఆకట్టుకొంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.183.02 కోట్లు వసూలు చేసింది. అతి త్వరలో రూ.200కోట్ల మార్క్ అందుకుటుందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఓ వైపు తెలుగు పాన్ ఇండియా మూవీ పుష్ప, కపిల్ దేవ్ బయోపిక్ 83 విడుదల అయినా కూడా డబ్బింగ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోం కలెక్షన్‌లను తగ్గించలేకపోతున్నాయి. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్పైడర్ మ్యాన్ సినిమా వీక్షకులను ఆకట్టుకుంది.
#SpiderMan is gradually slowing down, but the job is done... All eyes on its journey towards ₹ 200 cr… [Week 2] Fri 6.75 cr, Sat 10.10 cr, Sun 10 cr, Mon 4.45 cr, Tue 3.65 cr. Total: ₹ 183.02 cr Nett BOC. #India biz. pic.twitter.com/nyzdnALFku
— taran adarsh (@taran_adarsh) December 29, 2021
రెండు వారాలైనా అదే క్రేజ్..
సినిమా విడుదలై దాదాపు రెండు వారులు కావొస్తుంది. స్పైడర్ మ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ టాప్ సినిమా 83, అల్లు అర్జున్ పుష్ప మూవీ ఉన్నా.. స్పైడర్ మ్యాన్ కలెక్షన్‌లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం హిందీలో ఆదివారం వరకు బాక్సాఫీసు వద్ద మొత్తం రూ. 37.20 కోట్లు రాబట్టింది. 'పుష్ప' విడుదలై ఆదివారం నాటికి పది రోజులు కాగా, ఆదివారం ఒక్కరోజే రూ. 4.25 కోట్లు వసూలు చేసింది.
Malaika Arora: ఈ ఏడాది కుర్రకారు మతులు పోగొట్టిన బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా టాప్ ఫోటోలు ఇవే!
జుమాంజీ చిత్రాన్ని దాటేసింది..
అంతే కాదు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్‌ల చరిత్ర సృష్టిఓంది. ఈ సినిమా ఇప్పటికే 1 బిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్‌లు వసూలు చేసింది. ఇప్పటి వరకు US బాక్సాఫీస్ వద్ద USD 405.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 2017 నాటి జుమాంజి: వెల్‌కమ్ టు ది జంగిల్‌ను అధిగమించింది, ఇది ఇప్పటివరకు USD 404.5 మిలియన్ల కలెక్షన్‌తో సోనీ యొక్క అత్యధిక వసూళ్లు సాధించింది.
OTT Movies: "ఆహా"లో దుమ్మురేపిన డబ్ మూవీస్.. ఈ ఏడాది ఇవే టాప్!
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్'స్ డే వన్ కలెక్షన్ కోవిడ్ కంటే ముందు 2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ కంటే 3.5 రెట్లు ఎక్కువ. ఇది 2019 చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత భారతదేశంలో హాలీవుడ్ (Hollywood) విడుదలల చరిత్రలో రెండవ అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office, Box Office Collections, Hollywood, Telugu Movie