ప్రియమైన వారితో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నిధి అగర్వాల్

‘ ప్రియమైన వారితో గోవాలో గోవాలో నా రోజు గడిచింది’ అంటూ ట్వీట్ పెట్టింది అందాల నిధి.

news18-telugu
Updated: November 19, 2019, 9:32 AM IST
ప్రియమైన వారితో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ (Photo: nidhhiagerwal/Instagram)
  • Share this:
టాలీవుడ్ అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం గోవాలో బిజీ బిజీగా ఉంది. అయితే ఆమె అక్కడ ఎవరితో ఎంజాయ్ చేస్తుందంటే... ఇస్మార్ట్ టీమ్ అంతా అక్కడే ఉండటంతో... ఇక ఈ పోరీ కూడా గోవా బాట పట్టింది. ప్రస్తుతం గోవాలోదర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ, రమ్యకృష్ణ అంతా అక్కడే ఉన్నారు. ఇక ఈ బ్యూటీ కూడా వారితో చేరిపోయింది. ఈ మేరకు నిధి తన ట్విట్టర్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది. ‘ ప్రియమైన వారితో గోవాలో గోవాలో నా రోజు గడిచింది’ అంటూ ట్వీట్ పెట్టింది. పూరి, ఛార్మితో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

ఇక పోతే... పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో నడుస్తుంది. పూరి చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు