"అరవింద సమేత"ను ఆ ప్రమోషన్స్ కాపాడతాయా..?
ఇంకా ఒక్క వారం.. మరొక్క వారం.. ఇప్పుడు అరవింద సమేత టీం కోరుకుంటున్నది కూడా ఇదే. అందుకే ఇప్పటికీ ప్రమోషన్స్ ఆపడం లేదు అరవింద సమేత టీం. ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు.. డైలాగులు.. పాటలు విడుదల చేస్తూనే ఉన్నారు.

‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రయూనిట్ విడుదల చేసిన న్యూ పోస్టర్
- News18 Telugu
- Last Updated: October 28, 2018, 4:08 PM IST
ఇంకా ఒక్క వారం.. మరొక్క వారం.. ఇప్పుడు అరవింద సమేత టీం కోరుకుంటున్నది కూడా ఇదే. అందుకే ఇప్పటికీ ప్రమోషన్స్ ఆపడం లేదు అరవింద సమేత టీం. ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు.. డైలాగులు.. పాటలు విడుదల చేస్తూనే ఉన్నారు. అవి చూసిన తర్వాత మూడో వీకెండ్ కూడా కలెక్షన్లు వస్తాయనేది "అరవింద సమేత" టీం ఆశ. అలా కానీ జరిగితే ఈ వారం చాలాచోట్ల సేఫ్ జోన్ వెళ్ళనుంది ఈ చిత్రం.

ఇదే జరిగితే "అరవింద సమేత" హిట్ అనిపిస్తుంది. లేదంటే మళ్లీ అబౌ యావరేజ్ దగ్గరే ఆగాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు "అరవింద సమేత 93 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 65.55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ సినిమా సేఫ్జోన్కి రావాలంటే 70 కోట్లు రావాలి. అంటే మరో 5 కోట్లు వెనకబడి ఉందన్నమాట. నైజాంలో 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సేఫ్ జోన్ కు వచ్చింది ఈ చిత్రం. ఇక సీడెడ్లో వరసగా మూడోసారి 10 కోట్ల షేర్ మార్క్ అందుకున్నాడు ఎన్టీఆర్. మూడోవారంలోనూ కొన్ని చోట్ల మంచి వసూళ్లే తీసుకొచ్చింది "అరవింద సమేత".
గత వారం పోటీగా "హలో గురు ప్రేమకోసమే"తో పాటు "పందెంకోడి 2" సినిమాలు కూడా వచ్చాయి. ఇవన్నీ తట్టుకుని.. నిలబడి బాక్సాఫీస్ దగ్గర "అరవింద సమేత" తెచ్చే ఒక్కో కోటి దాని సత్తాకు నిదర్శనం. అందుకే ఇప్పట్నుంచి వచ్చే ప్రతీ రూపాయి కౌంట్ అన్నమాట. ఈ ప్రమోషన్ తో అయినా కచ్చితంగా ఈ ఒక్క వారం నిలబడుతుందని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. అది జరుగుతుందో లేదో..?

‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్