Vishal Marriage | విశాల్ పెళ్లి ఆగిపోయిందా.. ఇంతకీ ఏం జరిగింది..

Vishal Marriage | కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా.

news18-telugu
Updated: August 22, 2019, 1:58 PM IST
Vishal Marriage | విశాల్ పెళ్లి ఆగిపోయిందా.. ఇంతకీ ఏం జరిగింది..
విశాల్
news18-telugu
Updated: August 22, 2019, 1:58 PM IST
కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే చేసుకుంటానన్న విశాల్..అనుకున్నట్టే ఈ భవన నిర్మాణ దశలోనే ఉండగానే  ప్రముఖ నటి అనీషా రెడ్డితో మార్చి 10న నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఎంగేజ్మెంట్ తర్వాత అనీషా రెడ్డి.. విశాల్‌తో ఉన్న ఫోటోలను ఎప్పుటి కపుడు పోస్ట్ చేస్తూ ఉండేది. నిశ్చితార్ధం తర్వాత విశాల్ షూటింగ్ నిమిత్తం టర్కీకి వెళ్లాడు. అపుడు తన వెంట అనీషాను కూడా తీసుకెళ్లాడు.  రీసెంట్‌గా అనీషా రెడ్డి.. విశాల్‌తో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో డెలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో త్వరలో వీరి పెళ్లి..పీఠల వరకు పోకుండానే ఆగిపోయినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే.. వీరిద్దరి పెళ్లి విషయమై.. అటు విశాల్ కానీ, అనీషా కానీ స్పందించడం లేదు.

అనీషా విషయానికొస్తే.. తెలుగు ఈ భామ.. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లో నటించింది. ఇక ‘అయోగ్య’ సినిమా షూటింగ్ సమయంలో అనీషా రెడ్డితో ఈయ‌నకు రెండేళ్ళ కింద ప‌రిచ‌యం అయింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి ఇప్పుడు ఏడ‌డుగులు వేయబోతున్న ఈ సమయంలో సడెన్‌గా వీరి పెళ్లి ఆగిపోయినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీళ్లిద్దరి పెళ్లి విషయమై క్లారిటీ రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...