‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ పూర్తైపోయింది. డిసెంబర్ 18న ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ్ కొట్టేసాడు..
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ పూర్తైపోయింది. డిసెంబర్ 18న ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ్ కొట్టేసాడు అనిల్ రావిపూడి. బిజినెస్ మేన్ తర్వాత అంత వేగంగా మహేష్ కెరీర్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఈ మధ్య కాలంలో అయితే ఇదే. ఇక ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అనిల్ రావిపూడికి కామెడీపై ఉండే పట్టు చూస్తుంటే అదంతా నిజమే అని ఒప్పుకోవాల్సిందే.
చమ్మక్ చంద్ర మహేష్ బాబు
ఇక ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఓ హైలైట్ ట్రాక్ రాస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 39 నిమషాల పాటు ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇది కడుపులు చెక్కలైపోయేలా ఉంటుందని.. అప్పట్లో వచ్చిన వెంకీ ట్రైన్ సీక్వెన్స్ కంటే ఇది హైలైట్ అవుతుందని ధీమాగా చెబుతున్నారు సినిమాకు పని చేసినవాళ్లు. ఈ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి.. తమ అమ్మాయి అంటే మన హీరోయిన్ రష్మికను మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎత్తులుంటాయని తెలుస్తుంది.
Instagram
ఈ క్రమంలోనే హి ఈజ్ సో క్యూట్ సాంగ్ వస్తుంది. ఇందులోనే ఓ ఫైట్ కూడా ఉండబోతుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రంలో జబర్దస్త్ కమెడియన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండనది తెలుస్తుంది. ట్రైన్ ఎపిసోడ్లో జబర్దస్త్ కామెడీ షో నటులు చమ్మక్ చంద్ర, అప్పారావు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా పేలాయని తెలుస్తుంది. ఈ సినిమాలో వాళ్ల ఎపిసోడ్ ఫుల్ మాస్ కామెడీని పుట్టిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత నిర్మాత కమ్ యాక్టర్ బండ్ల గణేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
బండ్ల గణేష్ ఫైల్ ఫోటో (Source: Instgram/ Hari Teja)
ఇందులో దొంగగా మాంచి ఫన్ అందించాడని ప్రచారం జరుగుతుంది. ఈ కామెడీతో పాటు తమన్నా ఐటం సాంగ్ సినిమాకు మరో ప్లస్. ఎవరెన్ని చేసినా కూడా జబర్దస్త్ నటులతో ఉండే కామెడీ సీక్వెన్సులు మాత్రం అదిరిపోతాయని.. ఇది చూసిన తర్వాత వాళ్లకు మరింత డిమాండ్ పెరిగిపోవడం ఖాయమనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదలైన తర్వాత తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.