హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..

SP Balasubrahmanyam: తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubrahmanyam: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆ మధ్య ఒక్కసారిగా విషమించడంతో అంతా ఆందోళన పడ్డారు. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆ మధ్య ఒక్కసారిగా విషమించడంతో అంతా ఆందోళన పడ్డారు. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు కూడా దేవుడ్ని ప్రార్థించారు. బాలు బాగుండాలని.. బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇప్పుడు అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆయన ఆరోగ్యం చాలా త్వరగా కోలుకుంటుంది. కొన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం కుదుటపడుతూనే ఉంది. రోజురోజుకీ మెరుగవుతున్నాడు. ఇదే విషయం ఎస్పీ చరణ్ చెప్పాడు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)
ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)

తాజాగా ఈయన తన తండ్రి ఆరోగ్యం గురించి ట్వీట్ చేసాడు. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పటికీ ఎక్మోతో పాటు వెంటిలేటర్‌ కూడా కొనసాగుతుంది. అయినా కూడా ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటూ చెప్పాడు చరణ్.


త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌తో కూడా ఎక్మో కూడా తీసేస్తారని చెప్పాడు. ప్రస్తుతం రోజూ 20 నిమిషాల పాటు ఆయన ఫిజియో కూడా చేయించుకుంటున్నాడని.. అన్నీ బాగానే ఉన్నాయని చెప్పాడు చరణ్. బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై బయట వచ్చే వార్తలు నమ్మొద్దని చెప్పాడు చరణ్. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు ఈయన. వీలైనంత త్వరగా బాలు పూర్తి ఆరోగ్యంతో బయటికి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు ఎస్పీ చరణ్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు