Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 15, 2020, 9:42 PM IST
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో అంతా ఆందోళన పడ్డారు. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు కూడా దేవుడ్ని ప్రార్థించారు. బాలు బాగుండాలని.. బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇళయరాజా కూడా బాలు నువ్వు త్వరగా రా అంటూ వీడియో పోస్ట్ చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై మరో వార్త కూడా బయటికి వచ్చింది. తాజాగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)దీనికి సంబంధించి ఆడియో విడుదల చేసాడు చరణ్. అందులో మాట్లాడుతూ ''అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్డేట్ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్డేట్ ఇస్తాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు'' అని ఆడియో విడుదల చేసాడు చరణ్. ఇదిలా ఉంటే తాజాగా బాలు ఆరోగ్యంపై మరోసారి ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటన్ విడుదల చేసాయి. అందులో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడినట్లు తెలిపారు. ఆయన కోసం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 15, 2020, 4:12 PM IST