‘బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా’...ఇళయరాజా భావోద్వేగం

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా(ఫైల్ ఫోటో)

SP balasubramanyam Health Update | ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు.

 • Share this:
  కోవిడ్ బారినపడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షణిస్తోందన్న కథనాలతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీని ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు. మన జీవితం సినిమాతో మొదలైనది కాదని...సినిమాతో ముగిసిపోయేదీ కాదని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు. సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.

  ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలున్నా...మనం ఎప్పటికీ స్నేహితులమేనని...ఆ విషయం మన ఇద్దరికీ తెలుసని ఇళయరాజా పేర్కొన్నారు. నువ్వు తప్పనిసరిగా తిరిగి వస్తావని...తన అంతరాత్మ చెబుతోందని, అది నిజంకావాలని దేవుణ్ని తాను ప్రార్థిస్తున్నట్లు ఇళయరాజా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇళయరాజా వీడియో సందేశాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

  ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
  ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


  మ్యూజికల్ కచేరీల్లో తన పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడటంపై  ఇళయరాజా గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీనిపై ఎస్పీబీకి లీగల్ నోటీసులు కూడా జారీ చేయడం తెలిసిందే.
  Published by:Janardhan V
  First published: