హోమ్ /వార్తలు /సినిమా /

S. P. Balasubrahmanyam : బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్.. నిలకడగా ఆరోగ్యం..

S. P. Balasubrahmanyam : బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్.. నిలకడగా ఆరోగ్యం..

బాల సుబ్రహ్మణ్యం Photo : facebook

బాల సుబ్రహ్మణ్యం Photo : facebook

S. P. Balasubrahmanyam : కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో కరాళ నృత్యం చేస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

  కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో కరాళ నృత్యం చేస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. దీనికి సంబందించి ఓ వీడియోను విడుదల చేసిన బాలు.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని.. జ్వరంతో పాటు దగ్గుతో కూడా బాధపడుతున్నానని.. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, శ్రేయోభిలాషులకు విన్నవిస్తూ.. ఎలాంటీ ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు.

  ఆయన ఇంకా మాట్లాడుతూ.. తన అభిమానుల ఆశీస్సులతో అతి త్వరలోనే కోలుకుంటానని చెబుతూ... ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. దీన్ని గ్రహించి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. ఇక కరోనా కారణంగా ఆయన చికిత్స కోసం చెన్నైలోని.. చూలాయిమేడులో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

  కాగా ఇటీవల మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరో దర్శకుడు తేజ కూడా తనకు పాజిటివ్‌ వచ్చినట్టుగా తెలిపాడు. మొన్న పాప్ సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడినట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు