హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubramaniam: వెంటిలేటర్‌పైనే SPB.. విదేశీ వైద్యుల పర్యవేక్షణ..

SP Balasubramaniam: వెంటిలేటర్‌పైనే SPB.. విదేశీ వైద్యుల పర్యవేక్షణ..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubramaniam: వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.

వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈయన కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా బాలు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. వెంటిలేటర్‌పైనే ఉన్నా నిలకడగా ఉన్నట్లు తెలిపారు ఎంజిఎం వైద్యులు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులెటన్ (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులెటన్ (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఈసీఎంఓ (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తులకు అదనపు మద్దతు అందించడం అన్నమాట. అలా బాలుకు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పని చేస్తుందన్నమాట ఇది. కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. విదేశీ వైద్యులు ఈయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ ఆక్సీజన్ నిండిన గాలిని పంపిస్తే.. ఈసీఎంఓ పంప్స్ రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సీజన్ నింపిన రక్తాన్ని పంపిణి చేస్తుంది. దానివల్ల పేషెంట్ శరీరం చికిత్సకు స్పందించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతినే బాలు కోసం వాడుతున్నారు వైద్యులు. ఇదంతా చూస్తుంటే బాలు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని అర్థమవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు