SP Balasubramaniam: బాలు ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ కన్నీటి పర్యంతం..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubramaniam: వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.

  • Share this:
వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈయన కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా బాలు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపాడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్. వెంటిలేటర్‌పైనే ఎస్పీబీ ఉన్నట్లు ఈయన చెప్పాడు. చెప్తూనే కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఈసీఎంఓ (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తులకు అదనపు మద్దతు అందించడం అన్నమాట. అలా బాలుకు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పని చేస్తుందన్నమాట ఇది. కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం బాగు పడుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు చరణ్.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ ఆక్సీజన్ నిండిన గాలిని పంపిస్తే.. ఈసీఎంఓ పంప్స్ రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సీజన్ నింపిన రక్తాన్ని పంపిణి చేస్తుంది. దానివల్ల పేషెంట్ శరీరం చికిత్సకు స్పందించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతినే బాలు కోసం వాడుతున్నారు వైద్యులు. ఇదంతా చూస్తుంటే బాలు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని అర్థమవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మేరకు తమిళ నటులు రజినీకాంత్, కమల్ సహా భారతీరాజా, ఇళయరాజా, రెహమాన్ లాంటి వాళ్లు ప్రార్థనలు చేయాలంటూ విజ్ఞప్తి కూడా చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published: