హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubramaniam: నాన్న సేఫ్.. వైద్యానికి స్పందిస్తున్నారన్న చరణ్..

SP Balasubramaniam: నాన్న సేఫ్.. వైద్యానికి స్పందిస్తున్నారన్న చరణ్..

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubramaniam: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలించాయి. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా నయం అవుతుంది.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలించాయి. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా నయం అవుతుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. నిన్నటి వరకు కూడా బాలు పరిస్థితి విషమంగానే ఉందని చెప్పిన చరణ్.. ఇప్పుడు మాత్రం నయం అయిపోయిందని గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balasubrahmanyam)

తన తండ్రి కోలుకుంటున్నారని.. వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపాడు. దాంతో బాలు అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రతీరోజూ హెల్త్ బులెటన్‌లో విషమంగానే ఉంది.. ఐసియులో ఉన్నారు.. వెంటిలేటర్‌పై చికిత్స సాగుతుందంటూ వచ్చేది. కానీ తాజాగా వచ్చిన బులెటన్‌లో మాత్రం బాలు ఆరోగ్యం మెరుగుపడిందని రావడం నిజంగానే శుభసూచకం. చరణ్ విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే చెప్పాడు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి మామూలుగానే ఉందని చెప్పుకొచ్చాడు.

' isDesktop="true" id="587896" youtubeid="pncJWu0G0Fw" category="movies">

దాదాపు 90 శాతం ఐసోలేషన్‌ నుంచి బయటికి వచ్చేశాడని చెప్పాడు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నాడని.. డాక్టర్స్‌కు అలాగే వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పుకొచ్చాడు చరణ్. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఎస్పీ చరణ్. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు ఎస్పీ చరణ్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు